Aamir Sohail : పాకిస్తాన్ పై ఆడ‌డం ‘సూర్య‌’కు క‌ష్టం

పాక్ మాజీ కెప్టెన్ అమీర్ సోహైల్

Aamir Sohail : దాయాదుల మ‌ధ్య కీల‌క‌మైన పోరుకు రంగం సిద్ద‌మైంది. ఆస్ట్రేలియా వేదిక‌గా ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ 2022 ప్రారంభ‌మైంది. ఇప్ప‌టికే ఇరు జ‌ట్లు ఆసిస్ లో రెడీ అయ్యాయి ఢీకొనేందుకు. టికెట్లు పూర్తిగా సేల్ కావ‌డం విశేషం. ఈ త‌రుణంలో ఎవ‌రు గెలుస్తార‌నే దానిపై చ‌ర్చ జ‌రుగుతోంది.

భార‌త్, పాకిస్తాన్ జ‌ట్ల మ‌ధ్య సూప‌ర్ -12లో భాగంగా మొద‌టి మ్యాచ్ జ‌ర‌గ‌నుంది అక్టోబ‌ర్ 23న ఆదివారం. దీంతో పాకిస్తాన్ కు చెందిన మాజీ ఆట‌గాళ్లు భార‌త్ జ‌ట్టును టార్గెట్ చేశారు. తాజాగా ఆ దేశానికి చెందిన మాజీ కెప్టెన్ అమీర్ సోహైల్(Aamir Sohail)  సంచ‌ల‌న కామెంట్స్ చేశాడు. గ‌తంలో పాకిస్తాన్ పేస‌ర్ వ‌సీం అక్రం భార‌త జ‌ట్టులో ఉన్న సూర్య కుమార్ యాద‌వ్ తోనే ప్ర‌మాద‌మ‌ని హెచ్చ‌రించాడు.

అయితే అందుకు భిన్నంగా కామెంట్ చేశాడు అమీర్ సోహెల్ . సూర్య కుమార్ యాద‌వ్ ఫామ్ లో ఉండ‌వ‌చ్చు. కానీ ప్ర‌తిసారి సెంచ‌రీలు చేయ‌లేడు. అత‌డు ఏమైనా వివ్ రిచ‌ర్డ్స్ లాగా ఆడాల‌ని అనుకుంటున్నారా. అలాంటిది ఏమీ లేదేని పేర్కొన్నాడు. ప్ర‌స్తుతం భార‌త జ‌ట్టులో మోస్ట్ డేంజ‌రస్ క్రికెట‌ర్ గా మారాడు సూర్య భాయ్.

ఒక్క‌సారి కుదురుకున్నాడంటే ఆప‌డం ఎవ‌రి త‌రం కావ‌డం లేదు. దీంతో అన్ని జ‌ట్లు ఇప్పుడు భార‌త జ‌ట్టు కంటే సూర్య కుమార్ యాద‌వ్ ఆట తీరుపై ఆందోళ‌న చెందుతున్నాయి. ఏ బౌల‌ర్ అయినా ఎంత‌టి ఫేమ‌స్ అయినా ఉతికి ఆరేస్తున్నాడు. అల‌వోక‌గా ప‌రుగులు సాధిస్తున్నాడు.

Also Read : పాకిస్తాన్ జ‌ట్టు బ‌లంగా ఉంది – రోహిత్ శ‌ర్మ

Leave A Reply

Your Email Id will not be published!