Harbhajan Singh Mann : ‘భ‌జ్జీ’కి ఆప్ బంప‌ర్ ఆఫ‌ర్

రాజ్య‌స‌భ సీటు లేదా బిగ్ పోస్ట్

Harbhajan Singh Mann : భార‌త క్రికెట్ జ‌ట్టులో టాప్ మోస్ట్ ప్లేయ‌ర్ గా పేరొందారు హ‌ర్భ‌జ‌న్ సింగ్. ఎన్నో విజ‌యాల‌లో కీల‌క పాత్ర పోషించారు. వ‌ర‌ల్డ్ క్రికెట్ లో ఉన్న అన్ని ఫార్మాట్ లలో ఆడాడు.

త‌న ఆట‌తో కీల‌క ప్లేయ‌ర్ గా మారాడు. ఇటీవ‌ల క్రికెట్ కు వీడ్కోలు ప‌లికారు. తాజాగా జ‌రిగిన ఎన్నిక‌ల‌కు ముందు భ‌జ్జీ సిద్దూతో క‌లిశాడు. పంజాబ్ సీఎంగా ఉన్న భ‌గ‌వంత్ మాన్ తో సాన్నిహిత్యం ఉంది.

భ‌జ్జీ అంటే పంజాబ్ లో ఎంతో ఇష్ట‌ప‌డ‌తారు. కుండ బ‌ద్ద‌లు కొట్టేలా మాట్లాడ‌టంలో మ‌నోడు టాప్. ఇటీవల రాష్ట్రంలో జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో 60 ఏళ్ల చ‌రిత్ర‌ను తిర‌గ రాసింది ఆమ్ ఆద్మీ పార్టీ.

117 సీట్ల‌కు గాను 92 సీట్లు కైవ‌సం చేసుకుంది. ఈ త‌రుణంలో ఆప్ క‌న్వీన‌ర్, ఢిల్లీ సీఎం హ‌ర్బ‌జ‌న్ సింగ్ (Harbhajan Singh Mann)కు మంచి ఆఫ‌ర్ ఇచ్చిన‌ట్లు స‌మాచారం. ఆయ‌న‌కు రాజ్య‌స‌భ సీటు లేదా ఉన్న‌త పోస్ట్ ఇచ్చే అవ‌కాశం ఉంద‌ని ప్ర‌చారం.

పంజాబ్ నుంచి ఎంపీగా కావచ్చు లేదా జ‌లంధ‌ర్ లోని కొత్త‌గా ఏర్పాటు చేయ‌బోయే స్పోర్ట్స్ యూనివ‌ర్శిటీకి హ‌ర్భ‌జ‌న్ సింగ్ కు బాధ్య‌త‌లు అప్ప‌గించ‌వ‌చ్చ‌ని టాక్.

ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా రాష్ట్రంలో కొత్తగా క్రీడాభివృద్ధి కోసం యూనివ‌ర్శిటీ చేస్తామ‌ని హామీ ఇచ్చారు. ఆట‌ల‌కు ప్ర‌యారిటీ ఇస్తామ‌న్నారు.

ఒక‌వేళ భ‌జ్జీ ఎంపీగా ఎంపికైతే స‌చిన్ త‌ర్వాత ఉంటాడు. కాగా సిద్దూ, భ‌జ్జీ క‌లిసి క్రికెట్ ఆడారు. ఇదిలా ఉండ‌గా కొత్తగా సీఎంగా ప్ర‌మాణ స్వీకారం చేసిన భ‌గ‌వంత్ మాన్ ను ప్ర‌శంసించారు భజ్జీ.

Also Read : ‘పీకే..సిన్హా’ సాయం మ‌రిచి పోలేను

Leave A Reply

Your Email Id will not be published!