Kejriwal Modi : దేశ రాజ‌కీయ‌ల‌పై ‘ఆప్’ ఫోక‌స్

రాబోయే ఎన్నిక‌ల్లో మోదీ వ‌ర్సెస్ కేజ్రీవాల్

Kejriwal Modi :  ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్‌, ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ దూకుడు పెంచారు. ఆయ‌న త‌న పార్టీని చాప కింద నీరులా విస్త‌రిస్తూ వెళుతున్నారు. ఇప్ప‌టికే ఆప్ ఢిల్లీతో పాటు పంజాబ్ లో కొలువుతీరింది.

రాజ‌స్థాన్ లో ఫోక‌స్ పెట్టారు. కొన్నేళ్లుగా ప‌వ‌ర్ లో ఉన్న బీజేపీ ప్ర‌జ‌ల‌కు ఏం చేసిందో చెప్పాల‌ని డిమాండ్ చేశారు. తాజాగా దేశం అభివృద్ది చెందాలంటే ఐదు స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించాలంటూ కొత్త నినాదం ఎత్తుకున్నారు.

విద్య‌, వైద్యం, ఉపాధి, మ‌హిళా భ‌ద్ర‌త‌, వ్య‌వ‌సాయం వీటిని ప‌రిష్క‌రిస్తే దేశం ప్ర‌పంచంలో నెంబ‌ర్ 1గా అవుతుంద‌ని ప్ర‌క‌టించారు. నిన్న‌నే త‌న ప్లాన్ ను ప్రారంభించారు.

ఇందుకు త‌న మోడ‌ల్ దేశానికి అవ‌స‌ర‌మంటూ నొక్కి చెప్పారు. ఇక ఎన్ని కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ‌లు ప్ర‌యోగించినా ఢిల్లీలో పాగా వేయ‌లేక పోతోంది బీజేపీ.

ఇక వ‌రుస అంత‌ర్గ‌త పోరు, స‌మ‌స్య‌ల‌తో వందేళ్ల రాజ‌కీయ చ‌రిత్ర క‌లిగిన కాంగ్రెస్ పార్టీ కునారిల్లుతోంది. త‌న పార్టీని కాపాడుకునేందుకు నానా తంటాలు ప‌డుతోంది.

ఇక బీజేపీని డైరెక్టుగా ఢీకొనేందుకు ప్ర‌తిప‌క్షాలు ప్ర‌య‌త్నం చేసినా వ‌ర్క‌వుట్ కావ‌డం లేదు. దేశ వ్యాప్తంగా బీజేపీకి అస‌లైన ప్ర‌త్యామ్నాయం ఒక్క ఆప్

మాత్ర‌మేన‌ని ఇంకే పార్టీ ద‌రిదాపుల్లోకి రాదంటున్నారు కేజ్రీవాల్(Kejriwal).

ఇదే స‌మ‌యంలో మోదీపై నేరుగా యుద్దం ప్ర‌క‌టించిన ప‌వార్ , మ‌మ‌తా బెన‌ర్జీ , ఉద్ద‌వ్ ఠాక్రే అంతా మౌనం పాటించారు. ఏం చేయాలో తోచ‌డం లేదు.

నిన్న‌టి దాకా వ‌రుస‌గా దుమ్మెత్తి పోస్తూ వ‌చ్చిన శివ‌సేన అగ్ర నాయ‌కుడు సంజ‌య్ రౌత్ జైల్లో ఉన్నాడు.

ఇక కేసీఆర్ పైకి ఆరోప‌ణ‌లు చేస్తున్నా ఈరోజు వ‌ర‌కు ఢీకొంటున్న దాఖ‌లాలు లేవు. మ‌రో వైపు త‌మిళ‌నాడు సీఎంది ఒకే మాట‌. ఆయ‌న త‌న ప్రాంతం

ప‌రిర‌క్ష‌ణ పైనే ఫోక‌స్ పెడుతున్నారు.

ఇక మోదీని ఢీకొనే స‌త్తా ఎవ‌రికి ఉంద‌నే దానిపై మ‌ల్ల‌గుల్లాలు ప‌డుతున్నారు ప్ర‌తిపక్ష పార్టీలు. రోజు రోజుకు బీజేపీ బ‌లంగా విస్త‌రిస్తోంది. రేప‌టి సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు సిద్దం అవుతోంది.

ఆపార్టీ ఇప్ప‌టి నుంచే పావులు క‌దుపుతోంది. మోదీ(Modi) త్ర‌యం పాచిక‌లు, వ్యూహాల ముందు ఏ పార్టీలు ఎదుర్కొనే స‌త్తాను ప్ర‌ద‌ర్శించ లేక పోతున్నాయి.

Also Read : కాంగ్రెస్ పార్టీలో లేఖల‌ క‌ల‌క‌లం

Leave A Reply

Your Email Id will not be published!