AAP BJP : ఇటీవల జరిగిన ఎన్నికల్లో పంజాబ్ లో అధికారంలోకి వచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. త్వరలో గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ లలో ఎన్నికలు జరగనున్నాయి.
ఈ తరుణంలో ఆప్ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్(AAP BJP) దేశ వ్యాప్తంగా ఆప్ ను విస్తరించే పనిలో పడ్డారు. ఆయనతో పాటు పంజాబ్ సీఎం భగవంత్ మాన్ తో కలిసి రెండు రాష్ట్రాలలో పర్యటించారు.
ఈ తరుణంలో కేజ్రీవాల్ రోడ్ షోలు, భారీ ర్యాలీలు చేపట్టారు. తాజాగా ఆమ్ ఆద్మీ పార్టీకి హిమాచల్ ప్రదేశ్ లో కోలుకోలేని షాక్ తగిలింది. ఆ పార్టీ చీఫ్ అనూప్ కేసరి గుడ్ బై చెప్పాడు.
ఆయన భారతీయ జనతా పార్టీ తీర్థం పుచ్చుకున్నాడు. బీజేపీ నేషనల్ చీఫ్ జేపీ నడ్డా, కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ సమక్షంలో కేసరి బీజేపీలో చేరాడు.
అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆప్ చీఫ్ గుడ్ బై చెప్పడం రాష్ట్రంలో కలకలం రేగింది. అనూప్ కేసరి ఎనిమిది సంవత్సరాలుగా ఆమ్ ఆద్మీ పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్నారు.
పార్టీని విస్తరించడంలో కీలక పాత్ర పోషించాడు. ఇదిలా ఉండగా అనూప్ కేసరితో పాటు ఆప్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్ కుమార్, ఉనా జిల్లా ఆప్ ప్రెసిడెంట్ ఇక్బాల్ సింగ్ సైతం భారతీయ జనతా పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా కేసరి ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ పై నిప్పులు చెరిగారు. ఆయన ఒంటెద్దు పోకడలు నచ్చకే తాను బీజేపీలోకి వచ్చానని చెప్పారు.
Also Read : కాంగ్రెస్ పగ్గాలు రాహుల్ కు ఇవ్వాలి