AAP MLA PROTEST : ఆప్ ఎమ్మెల్యే అరెస్ట్ పై నిరసన
పార్టీ మౌనంపై డిగ్గీ రాజా నిలదీత
AAP MLA PROTEST : ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే(AAP MLA PROTEST) అమానతుల్లా ఖాన్ అరెస్ట్ కు నిరసనగా ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం ప్రజలు స్వచ్చందంగా తమ దుకాణాలు మూసి వేశారు.
ఎమ్మెల్యే ఖాన్ సతీమణి షఫియా, ఓఖ్లా ప్రజలు తాము ఎన్నుకున్న ప్రతినిధికి సంఘీభావంగా ఉదయం 9 నుండి సాయంత్రం 5 గంటల వరకు షట్టర్లను మూసి ఉంచాలని నిర్ణయించారు.
ఆగ్నేయ ఢిల్లీలో ఆక్రమణల నిరోధక డ్రైవ్ లో జోక్యం చేకున్నారు. అల్లర్లు, ప్రభుత్వ ఉద్యోగులను వారి విధులను నిర్వర్తించకుండా అడ్డుకోవడం ఆరోపణలపై ఢిల్లీ పోలీసులు పోలీసులు అరెస్ట్ చేశారు.
భారతీయ జనతా పార్టీ పాలక పౌర సంఘం వారు చట్ట విరుద్దమని భావించిన అనేక నిర్మాణాలను కూల్చి వేసింది. విచిత్రం ఏమిటంటే ఆమ్ ఆద్మీ పార్టీకి(AAP MLA PROTEST) చెందిన ఎమ్మెల్యే అరెస్ట్ చేసినా ఇప్పటి వరకు ఆప్ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పందించ లేదు.
దీనిని తప్పు పట్టారు కాంగ్రెస్ అగ్ర నేత దిగ్విజయ్ సింగ్. ఖాన్ మద్దతుదారులంతా ఆప్ కు వ్యతిరేకంగా నిప్పులు చెరగడం చర్చకు దారి తీసింది.
వివాదస్పద పౌరసత్వ చట్టం సీఏఏ , నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ (ఎన్ఆర్సీ)పై ఆప్ బీజేపీకి మద్దతు ఇస్తుండగా ఖాన్ వాటిని బహిరంగంగా వ్యతిరేకించారని ఆరోపించారు.
మదన్ పూర్ ఖాదర్ ప్రాంతంలో కూల్చివేతకు వ్యతిరేకంగా నిరసనలో పాల్గొన్నందుకు ఆప్ నాయకుడు, అతని మద్దతుదారులను అరెస్ట్ చేశారు.
పేదల ఇళ్లను కాపాడేందుకు తాను ఎంత వరకైనా , జైలుకు వెళ్లేందుకు సిద్దంగా ఉన్నానని ప్రకటించాడు అమనుతుల్లా ఖాన్.
Also Read : మాజీ మంత్రి కేవీ థామస్ పై కాంగ్రెస్ వేటు