Harbhajan Singh : ఆప్ విజ‌యం అద్భుతం – భ‌జ్జీ

ప్ర‌జ‌ల విశ్వాసానికి స‌లాం

Harbhajan Singh : ఢిల్లీ న‌గ‌ర పాల‌క సంస్థ ఎన్నిక‌ల్లో ఆమ్ ఆద్మీ పార్టీ అద్భుత విజ‌యాన్ని న‌మోదు చేయ‌డంపై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు క్రికెట‌ర్ నుంచి రాజ‌కీయ నాయ‌కుడిగా మారిన రాజ్య‌స‌భ ఎంపీ హ‌ర్భ‌జ‌న సింగ్(Harbhajan Singh). బుధ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ప్ర‌జ‌ల‌కు కావాల్సింది ఏమిటో వాళ్లు తెలుసుకుంటార‌ని అందుకు ఈ ఎన్నిక‌లు నిద‌ర్శ‌న‌మ‌న్నారు.

తాను ఎవ‌రిని వ్య‌క్తిగ‌తంగా విమ‌ర్శించేందుకు ఇష్ట‌ప‌డ‌న‌ని పేర్కొన్నాడు. రాజ‌కీయాలు త‌న‌కు తెలియ‌ని కానీ దేశ రాజ‌ధాని ఢిల్లీలో ఊహించ‌ని రీతిలో ఆప్ కు అద్భుత విజ‌యాన్ని చేకూర్చి పెట్టార‌ని ప్ర‌శంసించారు. త‌మ పార్టీకి గ‌ణ‌నీయ‌మైన రీతిలో స్థానాలు క‌ల్పించినందుకు ప్ర‌తి ఒక్క‌రికీ ధ‌న్య‌వాదాలు తెలియ చేసుకుంటున్న‌ట్లు చెప్పారు హ‌ర్భ‌జ‌న్ సింగ్.

ఎవ‌రైనా త‌మ‌కు భ‌ద్ర‌త ఉండాల‌ని కోరుకుంటార‌ని, త‌మ పార్టీ ముఖ్య ఉద్దేశం ప్ర‌జ‌ల‌కు మెరుగైన రీతిలో సేవ‌లు అందించ‌డం ని తెలిపారు. విద్య‌, వైద్యం, న్యాయం అందాల్సిన అవ‌స‌రం ఉంద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. ఇదిలా ఉండ‌గా ఎంసీడీ ఎన్నిక‌ల్లో మొత్తం 250 వార్డుల‌కు కాను 134 సీట్ల‌లో ఆప్ విజ‌య ఢంకా మోగించింది.

ఇక గ‌త 15 ఏళ్లుగా ఢిల్లీ న‌గ‌ర పాల‌క సంస్థ భార‌తీయ జ‌న‌తా పార్టీ ఆధీనంలో ఉండింది. కానీ దానికి కోలుకోలేని రీతిలో షాక్ ఇచ్చారు ఢిల్లీ న‌గ‌ర పౌరులు. కేవ‌లం 104 సీట్ల‌కే ప‌రిమితం చేశారు. ఇక కాంగ్రెస్ పార్టీకి కేవ‌లం 9 సీట్లు మాత్ర‌మే ద‌క్కాయి. ఇదిలా ఉండ‌గా ఎంసీడీ ఎన్నిక‌ల్లో మ‌రో చ‌రిత్ర న‌మోదైంది.

అదేమిటంటే ఆమ్ ఆద్మీ పార్టీ త‌ర‌పున నిల‌బ‌డిన ట్రాన్స్ జెండ‌ర్ బోబీ ఘ‌న విజ‌యం సాధించారు.

Also Read : ఆప్ విజ‌యం అంత‌టా సంబురం

Leave A Reply

Your Email Id will not be published!