ABG Shipyard Scam : ఈ దేశం ఎటు పోతోంది. ఆర్థిక నేరగాళ్లకు అడ్డాగా మారింది. ఇప్పటి వరకు దేశ సంపదను కొల్లగొడుతూ దర్జాగా పాలకులతో అంటకాగుతున్నా నిస్సిగ్గుగా ఇంకా వారిని వెనకేసుకు వస్తోంది ఈ ప్రభుత్వం.
ఇప్పటికే దేశం దాటి విదేశాల్లో ఎంచక్కా ఎంజాయ్ చేస్తున్నా చూసీ చూడనట్లు వ్యవహరిస్తోంది.
అక్కడి చట్టాల లోని లొసుగులను ఆసరాగా చేసుకుని ఇక్కడ ప్రజల సొమ్మును లూటీ చేస్తున్నారు.
ఇప్పటి వరకు దేశ చరిత్రలోనే కనీ విని ఎరుగని భారీ బ్యాంకు స్కాం బట్ట బయలైంది. అది కూడా రిషీ అగర్వాల్(ABG Shipyard Scam ).
దేశాన్ని లూటీ చేయడంలో అగర్వాల్ లు ఆరి తేరి పోయారు.
ఏబీజీ షిప్ యార్డు స్కామ్ మామూలు మోసం కాదు. ఏకంగా రూ. 22 వేల 842 కోట్ల స్కాం. భారత దేశంలోనే అతి పెద్ద బ్యాంకింగ్ స్కామ్ గా అభివర్ణిస్తున్నారు ఆర్థిక నిపుణులు.
ఈ ఏబీజీ షిప్ యార్డు కంపెనీని 1985 మార్చి 15న ఏర్పాటు చేశారు. దీని చైర్ పర్సన్ గా ఉన్న రిషి కమలేష్ అగర్వాల్,
ఇతర అధికారులు కలిసి ఏకంగా 28 బ్యాంకులకు కుచ్చు టోపీ పెట్టారు.
మొత్తం రూ. 22 వేల కోట్లకు పైగా కన్నం వేశారు. సూరత్ కు చెందిన ఈ కంపెనీ భారీ మోసానికి పాల్పడింది. నౌకా నిర్మాణ పరిశ్రమలో పవర్ హౌస్ గా ఇది పని చేసింది.
ఎస్బీఐ ఫిర్యాదుతో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ – ఈడీ కేసు బుక్ చేయడంతో పెద్ద ఎత్తున దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. దేశంలోనే అతి పెద్ద బ్యాంకు మోసంగా పరిగణించింది ఈడీ.
ఈ కంపెనీ ఉచ్చులో పడి ప్రజా ధనాన్ని అప్పనంగా కట్టబెట్టిన వాటిలో ఎస్బీఐ (ABG Shipyard Scam )కూడా ఉంది. డబ్బులు తీసుకున్న బ్యాంకుల్లో ఐసీఐసీఐ,
బ్యాంక్ ఆఫ్ బరోడా, సెంట్రల్ బ్యాంక్ సహా 28 బ్యాంకుల కన్సార్టియను మోసగించారనే ఆరోపణలు వెల్లువెత్తాయి.
రిషి అగర్వాల్ తో పాటు మరో ఎనిమిది మందిపై కేసు నమోదు చేసినట్లు ఈడీ వెల్లడించింది. బ్యాంకులు అడ్వాన్స్ గా ఇచ్చిన సీసీ లోన్, టర్మ్ లోన్ , లెటర్ ఆఫ్ క్రెడిట్ ,
బ్యాంక్ గ్యారెంటీ ఇతర వాటితో సహా బ్యాంకు రుణాలకు సంబంధించి పరిశీలించాక కేసు నమోదు చేసినట్లు సీబీఐ వెల్లడించింది.
1985లో మాగ్డల్లా షిప్ యార్డు ప్రైవేట్ లిమిటెడ్ గా స్థాపించారు. నౌకా నిర్మాణం, ఓడ మరమ్మత్తు వ్యాపారంలో నిమగ్నమై ఉంది. దీని రిజిష్టర్ కార్యాలయం అహ్మదాబాద్ లో ఉంది.
షిప్ యార్డులు సూరత్, దహేజ్ లో ఉన్నాయి. 16 ఏళ్లల్లో 165 కంటే ఎక్కువ నౌకలను నిర్మించింది. 2007-08 లో కంపెనీ ఆర్థిక సంక్షోభాన్ని చవి చూసింది. 2012 నుంచి కంపెనీకి నష్టాలు ప్రారంభమయ్యాయి.
2016 నాటికి షిప్ యార్డు నికర నష్టం రూ. 3, 704 కోట్లకు చేరింది. ఆదాయం రూ. 37 కోట్లకు తగ్గింది. దీంతో ఆయా బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుంది.
ఆ డబ్బులను ఆఫ్ షోర్ పార్టీలు, విదేశీ అనుబంధ సంస్థలకు బదిలీ చేసినట్లు సమాచారం.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2019 నవంబర్ 8న ఏబీజీ షిప్ యార్డు పై కేసు నమోదు చేసింది.
సీఈబీఐ 2020 మార్చి 12న వివరణలు కోరంది. ఏడాదిన్నర దాటాక సీబీఐ ఎఫ్ఐఆర్ దాఖలు చేయడం విశేషం.
ఏబీజీ కంపెనీ ఐసీఐసై బ్యాంకు నుంచి రూ. 7, 089 కోట్లు, ఎస్బీఐ నుంచి రూ. రూ. 2, 925 కోట్లు, ఐడీబీఐ నుంచి రూ. 3, 639 కోట్లు, బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి రూ. 1, 614 కోట్లు,
పీఎస్బీ నుంచి రూ. 1,244 కోట్లు, ఎగ్జిమ్ బ్యాంకు నుంచి రూ. 1,327 కోట్లు, ఐఓబీ నుంచి రూ. 1,244 కోట్లు, బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి రూ. 719 కోట్లు తీసుకుంది.
కంపెనీ, దాని ప్రమోటర్లు బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను ఇతర ప్రయోజనాల కోసం ఉపయోగించినట్లు ప్రాథమిక సమాచారం. మొత్తంగా దేశంలో దొంగలు పడ్డారనేది వాస్తవం.
Also Read : వ్యక్తిత్వంలో ధనవంతుడు కోట్లల్లో సామాన్యుడు
Yes