Abortion Comment : హమ్మయ్య చట్టం బతికే ఉంది
అబార్షన్ అన్నది ఆమె హక్కు
Abortion Comment : ప్రజాస్వామ్యానికి ప్రతీకగా నిలుస్తూ వస్తోంది భారత దేశం. ఇప్పటికీ స్వేచ్ఛ లభించి 75 ఏళ్లు అవుతోంది. నేటికీ మహిళలు, బాలికలు, యువతులు, చిన్నారులపై అత్యాచారాలు, అఘాయిత్యాలు, దారుణాలు, హత్యలు చోటు చేసుకుంటున్నాయి. దేశ వ్యాప్తంగా ప్రతి రోజూ నిమిషానికి ఒక రేప్ జరుగుతోందని నేషనల్ క్రైమ్ బ్యూరో వెల్లడించడం ఒక రకంగా సిగ్గు పడాల్సిన విషయం.
ఇక అభివృద్ది చెందిన దేశాలలో సైతం ఆడపిల్లల పరిస్థితి ఇందుకు భిన్నంగా ఏమీ లేదు. ఇక భారత దేశం గురించి చెప్పాల్సిన పని లేదు. మరో వైపు
ముస్లిం దేశాలలో బానిసల కంటే ఎక్కువగా పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. ఇరాన్ లో హిజాబ్ (ముసుగు) సరిగా ధరించ లేదనే నెపంతో కొట్టి చంపేశారు.
ఇక ప్రపంచానికి తెలియకుండా ఎన్నో ఘోరాలు చోటు చేసుకుంటున్నాయి. మహిళలపై దారుణాలకు వ్యతిరేకంగా ఆందోళనలు, నిరసనలు
కొనసాగుతూనే ఉన్నాయి. కానీ వారి పట్ల వివక్ష ఇంకా కొనసాగుతూనే ఉంది. ప్రధానంగా రేప్ లకు గురవుతున్న వారి సంఖ్య రోజు రోజుకు ఎక్కువవుతోంది.
లైంగిక నేరాలకు సమాజం కారణమా లేక చోటు చేసుకుంటున్న పెడ ధోరణులా అన్నది తేలాల్సి ఉంది. భారత్ లో మోదీ ప్రభుత్వం కొలువు తీరాక
రెండవ తరగతి శ్రేణి పౌరులుగా మారి పోయారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇది పూర్తిగా గమనించాల్సిన అంశం. నిత్యం మనువాదాన్ని నెత్తిన ఎత్తుకుని
దానినే మరో రాజ్యాంగంగా భావించే నాయకులు, సంస్థులు ఊరేగుతున్న దేశం ఇది.
ఓ వైపు కులాలు, మతాలు, ప్రాంతాల పేరుతో వ్యక్తుల మధ్య భేదాభిప్రాయాలు సృష్టిస్తూ వస్తున్న ఈ తరుణంలో మహిళలకు రక్షణ అన్నది
దొరుకుతుందని అనుకోవడానికి వీలు లేదు. దేశంలో రాజకీయ వ్యవస్థ పూర్తిగా అదుపు తప్పింది. చట్ట వ్యవస్థ దారుణంగా మారింది. బ్యూరోక్రసీ జవాబుదారీతనం కోల్పోయింది.
ఇదే సమయంలో బాధ్యత కలిగిన పౌర సమాజం ఇవాళ తమ పరిస్థితి ఏమిటి అని ప్రశ్నిస్తోంది. తరాలు మారినా టెక్నాలజీ విస్తరించినా ఇప్పుడు
మానవత్వం అన్నది కనిపించడం లేదు భూతద్దం పెట్టి వెతికినా. ప్రభుత్వమే పెను శాపంగా మారిన ఈ సమయంలో హక్కుల గురించి నిలదీయడం, నేరాల గురించి ప్రశ్నించడం ప్రభుత్వ వ్యతిరేకులుగా ముద్ర పడటం తప్ప ఇంకోటి కాదు.
ఇక భారత దేశంలో ఇంకా న్యాయం బతికే ఉందని అనడానికి అప్పుడప్పుడు మిణుకు మిణుకుమంటూ న్యాయ వ్యవస్థ తీర్పులు వెలువరిస్తూ ఉంటుంది.
అలాంటి తీర్పులలో చరిత్రాత్మకమైనది మహిళలకు సంబంధించి అబార్షన్(Abortion) అన్నది ఆమెకు సంబంధించిన హక్కు అని తీర్పు చెప్పింది సుప్రీంకోర్టు.
ఇన్నేళ్లకు చట్టం ఆమె పట్ల సానుకూలతను ప్రదర్శించింది. సురక్షితంగా అబార్షన్ చేయించుకొనే హక్కు ఉందని స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించి వివాహితులా లేక అవివాహితులా అన్నది రాజ్యాంగ విరుద్దమని కుండ బద్దలు కొట్టింది. మొత్తంగా ఈ తీర్పు మహిళా జాతికి ఒక ఊపిరి లాంటిది. జస్టిస్ డీవై చంద్రచూడ్ ధర్మాసనానికి సలాం చెప్పాల్సిందే.
Also Read : నరసింహా కరుణించు నన్ను రక్షించు