ACC Moves Asia Cup : పాకిస్తాన్ చేజారిన ఆసియా క‌ప్

పీసీబీకి ఏసీసీ కోలుకోలేని షాక్

ACC Moves Asia Cup : అటు ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) తో పాటు ఇటు ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) నుంచి కూడా పాకిస్తాన్ కు ఎలాంటి మ‌ద్ద‌తు ల‌భించ‌క పోవ‌డం విస్తు పోయేలా చేసింది.

ప్ర‌స్తుతం ప్ర‌పంచ క్రికెట్ రంగాన్ని భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) తీవ్రంగా ప్ర‌భావితం చేస్తోంది. ఇప్ప‌టికే ప‌లుమార్లు రుజువైంది. తాజాగా ఈ వివాదం ముదిరి పాకాన ప‌డింది. బీసీసీఐ, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) మ‌ధ్య మాట‌ల యుద్దం న‌డిచింది. చివ‌ర‌కు బీసీసీఐదే ఆధిప‌త్యం కొన‌సాగింది.

ఇదిలా ఉండ‌గా ఈ ఏడాది 2023లో ఆసియా క‌ప్ ను పాకిస్తాన్ లో నిర్వ‌హించాల్సి ఉంది. ఇక ఐసీసీ వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ భార‌త్ లో జ‌ర‌గాల్సి ఉంది. ఒక‌వేళ భార‌త జ‌ట్టు త‌మ‌తో ఆడ‌క పోతే తాము వ‌ర‌ల్డ్ క‌ప్ ను బ‌హిష్క‌రిస్తామ‌ని పీసీబీ చైర్మ‌న్ ప్ర‌క‌టించారు.

ఇదే విష‌యంపై ఆయ‌న ఐసీసీకి కూడా ఫిర్యాదు చేశారు. కానీ ఏసీసీ చైర్మ‌న్ గా ఉన్న బీసీసీఐ సెక్ర‌ట‌రీ జే షా సైతం డోంట్ కేర్ అన్నారు. ఆసియా క‌ప్ లో తాము ఆడే ప్ర‌స‌క్తి లేద‌ని స్ప‌ష్టం చేశారు. భ‌ద్ర‌తా కార‌ణాల రీత్యా త‌మ‌కు ఆట కంటే ఆట‌గాళ్ల ర‌క్ష‌ణ ముఖ్య‌మ‌ని పేర్కొన్నారు.

త‌ట‌స్థ వేదిక‌ల మీద తాము ఆడేందుకు సిద్ద‌మేన‌ని తెలిపారు. కానీ పీసీబీ ఒప్పు కోలేదు. తాజాగా ఆసియా క‌ప్(ACC Moves Asia Cup) ఆతిథ్యం పాకిస్తాన్ నుంచి చేజారింది. ఈ టోర్నీని పాకిస్తాన్ నుంచి ఇత‌ర చోటుకు త‌ర‌లించాల‌ని ఆసియా క్రికెట్ కౌన్సిల్ నిర్ణ‌యించింది. ఆసియా క‌ప్ శ్రీ‌లంక‌లో నిర్వ‌హించే ఛాన్స్ ఉంది.

Also Read : ఏసీసీ నిర్ణ‌యం పీసీబీ ఆగ్ర‌హం

Leave A Reply

Your Email Id will not be published!