Vikas Raj : ఆరోప‌ణ‌లు అబ‌ద్దం కౌంటింగ్ ప్ర‌శాంతం

రాష్ట్ర ఎన్నిక‌లం సంఘం చీఫ్ వికాస్ రాజ్

Vikas Raj : మునుగోడు ఎన్నిక‌ల కౌంటింగ్ కు సంబంధించి వివిధ పార్టీలు చేస్తున్న ఆరోప‌ణ‌ల‌న్నీ అవాస్త‌వ‌మ‌ని రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం క‌మిష‌న‌ర్ (సిఇఓ) వికాస్ రాజ్ స్ప‌ష్టం చేశారు. కేంద్ర మంత్రి జి. కిష‌న్ రెడ్డి, పార్టీకి చెందిన రాజ్య‌స‌భ స‌భ్యుడు ల‌క్ష్మ‌ణ్, మాజీ ఎంపీ వివేక్ వెంక‌టస్వామి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు.

పూర్తిగా అధికార పార్టీకి తొత్తుగా ప‌ని చేశారంటూ మండిప‌డ్డారు. దీనిపై సీరియ‌స్ గా స్పందించారు వికాస్ రాజ్(Vikas Raj). ఆరోప‌ణ‌ల్లో వాస్త‌వం లేద‌ని, కౌంటింగ్ ప్ర‌శాంతంగా జ‌రుగుతోంద‌న్నారు. తాను ఎప్ప‌టిక‌ప్పుడు ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌ను ప‌ర్య‌వేక్షిస్తున్న‌ట్లు చెప్పారు. ఎన్నిక‌ల ఫ‌లితాల్లో ఎలాంటి గంద‌రగోళం లేద‌న్నారు.

ఎలాంటి ఇబ్బంది లేద‌న్నారు వికాస్ రాజ్. రిట‌ర్నింగ్ ఆఫీస‌ర్ తో పాటు ఎన్నిక‌ల ప‌రిశీల‌కులు అక్క‌డ కౌంటింగ్ ప్ర‌క్రియ‌ను ప‌ర్య‌వేక్షిస్తున్నార‌ని స్ప‌ష్టం చేశారు. ఎప్ప‌టిక‌ప్పుడు రౌండ్ల వారీగా అప్ డేట్ చేయాలంటే ముందు రిట‌ర్నింగ్ ఆఫీస‌ర్ సంత‌కం చేయాల్సి ఉంటుంద‌న్నారు వికాస్ రాజ్.

ఇక్క‌డ పెద్ద ఎత్తున అభ్య‌ర్థులు ఉండ‌డం వ‌ల్ల‌నే ఆల‌స్యం జ‌రిగింద‌న్నారు. వేరే రాష్ట్రాల‌లో అభ్య‌ర్థులు ఆరుగురు మాత్ర‌మే ఉండ‌డం వ‌ల్ల కౌంటింగ్ కు సంబంధించి త్వ‌ర‌గా అప్ డేట్స్ వ‌స్తున్నాయ‌ని వెల్ల‌డించారు ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్. 250 మంది సిబ్బందిని నియ‌మించ‌డం జ‌రిగింద‌ని 100 మంది కౌంటింగ్ వ‌ద్ద ప‌ని చేస్తున్నార‌ని చెప్పారు.

మిగ‌తా 150 మంది ఇత‌ర ఏర్పాట్ల‌లో నిమ‌గ్న‌మై ఉన్నార‌ని పేర్కొన్నారు సిఇఓ. ఒక్క మునుగోడులో 47 మంది బ‌రిలో ఉండ‌డం వ‌ల్ల‌నే ఆల‌స్యం జ‌రుగుతోంద‌న్నారు.

ఒక్కో రౌండ్ కు గంట‌న్న‌ర‌కు పైగా ప‌డుతుంద‌న్నారు సిఇఓ.

Also Read : వికాస్ రాజ్ తీరుపై కిష‌న్ రెడ్డి ఫైర్

Leave A Reply

Your Email Id will not be published!