Sonali Phogat Case : ఫోగట్ కేసులో నిందితులు కస్టడీకి
ఏడు రోజుల పాటు విచారణ కోసం
Sonali Phogat Case : టిక్ టాక్ స్టార్, యాంకర్ , హర్యానా బీజేపీ నాయకురాలు సోనాలో ఫోగట్ కేసులో పురోగతి కనిపించింది. గోవాలో ఆమెకు మత్తు పదార్థాలు ఇచ్చి అత్యాచారానికి పాల్పడ్డారు.
ఆమెకు నిర్వహించిన పోస్ట్ మార్టమ్ లో దెబ్బలు ఉన్నాయని తేలింది. ఇదే తరుణంలో రంగంలోకి దిగిన పోలీసులు కేసుకు సంబంధించి ఆసక్తికర అంశాలు వెల్లడించారు.
ఈ కేసులో సోనాలీ ఫోగట్(Sonali Phogat ) వ్యక్తిగత సహాయకుడు, ఫ్రెండ్ తో పాటు రెస్టారెంట్ యజమాని, డ్రగ్స్ డీలర్ ను అదుపులోకి తీసుకున్నారు. వారందరినీ కోర్టులో హాజరు పరిచారు.
విచారణ నిమిత్తం కోర్టు 7 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపారు. ఇదిలా ఉండగా ఫోగట్ కు చెందిన మెథాం ఫెటమైన్ ను మరణించిన రోజు రాత్రి కొనుగోలు చేసినట్లు తెలిపారు.
అదుపులోకి తీసుకున్న వారు కూడా బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన విచారణ సెప్టెంబర్ 6న విచారణకు రానుంది.
ఇప్పటి వరకు సోనాలీ ఫోగట్ కేసులో ఐదుగురిని అరెస్ట్ చేశారు గోవా పోలీసులు. ఇక కేసులో తీవ్ర విచారణ ఎదుర్కొంటున్న కర్లీస్ రెస్టారెంట్ యజమాని ఎడ్విన్ నూన్స్ , మరో ఇద్దరు డ్రగ్ పెడ్లర్లు రామ మాండ్రేకర్, దత్త ప్రసాద్ గాంకర్ లను ప్రత్యేక నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ డ్రగ్స్ కోర్టు ఏడు రోజుల పాటు కస్టడీకి పంపింది.
వీరికి సంబంధించిన రిమాండ్ శుక్రవారంతో ముగిసింది. దేశ వ్యాప్తంగా సోనాలీ ఫోగట్ కేసు సంచలనం కలిగించింది. ఆమె మరణంలో వీరందరి ప్రమేయం ఉందని ఆరోపించారు పోలీసులు.
Also Read : కూతురికి ఎల్జీ అక్రమ కాంట్రాక్టు – ఆప్