Actor Ali Gaddar : ప్రజా వాగ్గేయకారుడు గద్దర్ – ఆలీ
నివాళులు అర్పించిన సినీ నటుడు
Actor Ali Gaddar : సినీ రంగానికి చెందిన పలువురు సినీ ప్రముఖులు ప్రజా గాయకుడు గద్దర్ కు నివాళులు అర్పించారు. హాస్య నటుడు ఆలీ(Ali) సోమవారం లాల్ బహూదర్ స్టేడియంలో గద్దర్ భౌతిక కాయాన్ని సందర్శించారు. పుష్ప గుచ్చం ఉంచి మౌనం పాటించారు. కుటుంబీకులను పరామర్శించారు. గద్దర్ ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు.
Actor Ali Gaddar Reminds
ఈ సందర్భంగా నటుడు ఆలీ మీడియాతో మాట్లాడారు. తాను తీసిన పిట్టలదొరను చూసి సంతోషానికి లోనయ్యారని గద్దర్ ను గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా తనను ప్రత్యేకంగా అభినందించారని చెప్పారు. తెలంగాణ కళాకారులకు అవకాశాలు ఇచ్చినందుకు కంగ్రాట్స్ తెలిపారని అన్నారు.
ఆయన ప్రజల మనిషి. జనం కోసం గానం చేసిన అరుదైన గాయకుడు గద్దర్ అని కొనియారు. ఆయన లేరన్న వార్త తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు నటుడు ఆలీ. ప్రజల కోసం చివరి వరకు గానం చేసిన అరుదైన గొంతుక గద్దరన్న అంటూ కొనియాడారు.
ఇదిలా ఉండగా గద్దర్ 1949లో సంగారెడ్డి నియోజకవర్గంలోని తూఫ్రాన్ లో పుట్టారు. ఆయన వయసు 74 ఏళ్లు. తొలుత కెనెరా బ్యాంకులో జాబ్ చేశారు. ప్రజల కోసం ఉద్యోగానికి రాజీనామా చేశారు. నక్సల్ ఉద్యమంలో చేరాడు. తన ఆట, పాటలతో ఊపిరి పోశాడు. దేశంలో జరిగిన అనేక ఉద్యమాలకు గద్దర్ చోదక శక్తిగా ఉన్నాడు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం జరిగిన అన్ని పోరాటాలలోను ముందంజలో ఉన్నాడు గద్దర్. జనం కోసం గానం చేసిన అరుదైన గాయకుడు గద్దర్. ప్రజా యుద్ద నౌకకు మరణం లేదని , పాటకు చావు లేదని నిరూపించాడు గద్దర్.
Also Read : MLC Kavitha Gaddar : దిగ్గజ గాయకుడు గద్దర్ – కవిత