Actor Dhanush : తిరుమలలో కొలువై ఉన్న శ్రీ వేంకటేశ్వర స్వామి, శ్రీ అలివేలు మంగమ్మను సోమవారం దర్శించుకున్నారను ప్రముఖ నటుడు ధనుష్. ఈ సందర్భంగా బ్రేక్ దర్శనం సమయంలో దర్శించుకున్నారు. నటుడికి పూజారులు, ఆలయ కమిటీ సాదర స్వాగతం పలికింది. ఇదిలా ఉండగా ధనుష్ దర్శించుకునే సమయంలో ఆయన వ్యక్తిగత సిబ్బంది కొంత దురుసుగా ప్రవర్తించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఏది ఏమైనా ధనుష్ శ్రీవారికి తలనీలాలు సమర్పించారు. ప్రస్తుతం ధనుష్ న్యూ లుక్ ఆకట్టుకునేలా ఉంది.
ఆయనతో పాటు కుటుంబం కూడా దర్శించుకుంది. ధనుష్(Dhanush) కొత్తగా సినిమా చేయబోతున్నాడు. దానికి ప్రస్తుతానికి డి 50 పేరు పెట్టారు మూవీ మేకర్స్. ఈ సినిమాలో పాత్రకు సంబంధించి తల మీద ఎలాంటి వెంట్రుకలు ఉండ కూడదని దర్శకుడు చెప్పినట్లు సమాచారం. అందుకే పనిలో పనిగా స్వామి వారి క్షేత్రంలో తలనీలాలు సమర్పించుకున్నారు నటుడు ధనుష్. ఇక త్వరలోనే కొత్త సినిమాకు సంబంధించి పూజలు చేయనున్నట్లు టాక్.
మరో వైపు తమిళ సినీ సూపర్ స్టార్ తలైవా రజనీ కాంత్ హీరోగా జైలర్ చిత్రాన్ని రూపొందిస్తోంది ప్రొడక్షన్ హౌస్ సన్ పిక్చర్స్. ఇదే సంస్థ డి 50 చిత్రాన్ని ప్లాన్ చేస్తోంది. ఈ చిత్రానికి ధనుష్ దర్శకత్వం వహించనున్నాడు. ఇదిలా ఉండగా 2017లో పా పాండి సినిమాకు కూడా డైరెక్షన్ చేశాడు. ఆయన నుంచి వచ్చిన రెండో సినిమా ఇది కావడం విశేషం.
Also Read : CM Siddaramaiah : శెట్టర్..బోస రాజు..తిప్పన్నలకు కంగ్రాట్స్