Actor Krishna Funeral : అశేష జ‌నం ముగిసిన ‘మ‌హా ప్ర‌స్థానం’

కృష్ణ అంత్య‌క్రియ‌లు పూర్తి

Actor Krishna Funeral : తెలుగు సినిమా రంగానికి చెందిన దిగ్గ‌జ న‌టుడు ఘ‌ట్ట‌మ‌నేని శివ‌రామ‌కృష్ణ ఇక సెల‌వంటూ వెళ్లి పోయారు. అశేష జ‌నం ఆయ‌న‌కు క‌డ‌సారి వీడ్కోలు ప‌లికారు. ఎక్క‌డ చూసినా ఆయ‌న ఫ్యాన్స్ తో నిండి పోయింది ప‌ద్మాల‌య ప్రాంగ‌ణ‌మంతా. అనంత‌రం భారీ ఎత్తున జ‌న వాహ‌ని వెంట రాగా క‌న్నీళ్ల‌తో కృష్ణ(Actor Krishna Funeral) అమ‌ర్ ర‌హే అంటూ అభిమానులు నినాదాలు చేశారు.

చివ‌రి సారి చూపు కోసం పెద్ద ఎత్తున సుదూర ప్రాంతాల నుంచి త‌ర‌లి వ‌చ్చారు. తెలుగు సినిమా రంగానికి చెందిన వారితో పాటు ఇత‌ర రాష్ట్రాల నుంచి కూడా విచ్చేశారు క‌డ‌సారి చూపు కోసం. ఆయ‌న‌తో అనుబంధం క‌లిగిన వాళ్లు, స్నేహితులు, హితులు, స‌న్నిహితులు పెద్ద ఎత్తున జూబ్లీ హిల్స్ లోని మ‌హా ప్ర‌స్థానంకు చేరుకున్నారు.

ఇప్ప‌టికే సీఎం కేసీఆర్ ప్ర‌క‌టించిన విధంగానే తెలంగాణ ప్ర‌భుత్వం అధికారిక లాంఛ‌నాల‌తో సూప‌ర్ స్టార్ కృష్ణ అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించారు. అంత‌కు ముందు మూడు రౌండ్లు గాల్లో కాల్పులు జ‌రిపి పోలీసులు గౌర‌వ వంద‌నం స‌మ‌ర్పించారు. ఘ‌ట్ట‌మ‌నేని కుటుంబ స‌భ్యుల అశ్రు నివాళుల మ‌ధ్య కృష్ణ అంత్య‌క్రియ‌లు ముగిశాయి.

విషాదం ఏమిటంటే ఈ ఏడాదిలో మ‌హేష్ బాబు ముగ్గురిని కోల్పోయారు. సోద‌రుడు ర‌మేశ్ బాబు, త‌ల్లి ఇందిరా దేవితో పాటు తండ్రి ఘ‌ట్ట‌మ‌నేని శివ‌రామ కృష్ణ ను వెంట వెంట‌నే కోల్పోవ‌డం తీవ్ర విషాదం నింపింది. అంత‌కు ముందు నాన‌క్ రామ్ గూడ లోని ప‌ద్మాల‌య స్టూడియో నుంచి మ‌హా ప్ర‌స్థానం వ‌ర‌కు కృష్ణ అంతిమ యాత్ర సాగింది.

ఇటు తెలంగాణ అటు ఏపీ నుంచి పెద్ద ఎత్తున త‌ర‌లి రావ‌డంతో ట్రాఫిక్ ఆంక్ష‌లు విధించారు.

Also Read : సూప‌ర్ స్టార్ చెర‌గ‌ని న‌వ్వుకు ప్ర‌తిరూపం

Leave A Reply

Your Email Id will not be published!