Actor Krishna : ఐసీయూలో సూపర్ స్టార్ కృష్ణ
ఆరోగ్య పరిస్థితిపై వైద్యుల ప్రకటన
Actor Krishna : ప్రముఖ నటుడు సూపర్ స్టార్ కృష్ణ ఐసీయూలో ఉన్నారు. హైదరాబాద్ లోని కాంటినెంటల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అర్ధరాత్రి ఇక్కడికి తీసుకు వచ్చారని ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. సోమవారం కీలక ప్రకటన చేశారు. కృష్ణకు గుండె పోటు రావడంతో మెరుగైన చికిత్స నిర్వహించడం జరిగిందన్నారు.
ప్రస్తుతం ఐసీయూలో మెరుగైన చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. చికిత్సకు నటశేఖర్ కృష్ణ(Actor Krishna) శరీరం సహకరిస్తోందని వెల్లడించారు వైద్యులు. క్రిటికల్ స్టేజ్ లో ఉన్నారని వైద్య నిపుణులు అంతా దగ్గరుండి పర్యవేక్షిస్తున్నామని చెప్పారు. ఆయనను తీసుకు వచ్చిన వెంటనే ఎమర్జెన్సీకి తీసుకు వెళ్లామని తెలిపారు.
కృష్ణ క్రిటికల్ స్టేజ్ లో ఉన్నారని , అయితే వెంటిలేటర్ పై చికిత్స అందజేస్తన్నట్లు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా సూపర్ స్టార్ కృష్ణ గత కొంత కాలం నుంచి శ్వాస సంబంధిత సమస్యతో బాధ పడుతున్నారు.
ఇదిలా ఉండగా ఆదివారం రాత్రి పరిస్థితి విషమించడంతో నటుడు మహేష్ బాబు, భార్య నమ్రతతో పాటు దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ, సినీ ప్రముఖులు కాంటినెంటల్ ఆస్పత్రికి చేరుకున్నారు. కృష్ణ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. మరో 48 గంటల వరకు ఏమీ చెప్పలేమంటూ స్పష్టం చేశారు కాంటినెంటల్ వైద్యులు.
దీంతో కృష్ణ ఆరోగ్యం బాగుండాలని లక్షలాది మంది అభిమానులు కోరుతున్నారు. మరో వైపు ఐసీయూలో బాగానే ఉన్నారంటూ మరికొందరు పేర్కొంటున్నారు.
మరో వైపు 48 గంటలు అయితేనే తప్ప ఏమీ చెప్పలేమని కాంటినెంటల్ వైద్యులు చెప్పడం మరింత ఆందోళన కలిగిస్తోంది. ఇంకోవైపు సోషల్ మీడియాలో గెట్ వెల్ సూన్ అంటూ హ్యాష్ టాగ్ ట్రెండ్ అవుతోంది.
Also Read : పండుగల వేళ తెలుగు సినిమాలకే ప్రయారిటీ