Actor Krishna : స్నేహ‌పాత్రుడు అభిమాన‌ధ‌నుడు

సూప‌ర్ స్టార్ కృష్ణ చిర‌స్మ‌ర‌ణీయుడు

Actor Krishna : సూప‌ర్ స్టార్ కృష్ణ గురించి ఎంత చెప్పినా త‌క్కువే. ఒక సామాన్యుడిగా త‌న జీవితాన్ని ప్రారంభించి అంచెలంచెలుగా సినిమా రంగం మీదున్న ప్రేమ‌తో ఒక శ‌క్తిగా, విస్మ‌రించిన పరిశ్ర‌మ‌గా ఎదిగారు ఘ‌ట్ట‌మ‌నేని శివ‌రామ‌కృష్ణ‌(Actor Krishna). ఆయ‌న మ‌ర‌ణంతో తెలుగు వెండి తెర గొప్ప న‌టుడినే కాదు గొప్ప మ‌న‌సున్న మారాజును కోల్పోయింది.

ఎల్ల‌ప్పుడూ సానుకూల దృక్ఫ‌థాన్ని క‌లిగి ఉన్నారు. ఎక్క‌డా ప‌ల్లెత్తు మాట అనేందుకు ఇత‌రుల గురించి ఇష్ట‌ప‌డే వారు కాదు. ఒక ర‌కంగా చెప్పాలంటే సూప‌ర్ స్టార్ కృష్ణ‌ను అజాత శ‌త్రువు అని చెప్ప‌క త‌ప్ప‌దు. ఆయ‌న ఎంద‌రికో చేయూత‌నిచ్చారు. వేలాది మంది అభిమానుల‌ను, అభిమాన సంఘాల‌ను క‌లిగి ఉన్న ఏకైక న‌టుడు కృష్ణ‌. న‌టుడిగా, ద‌ర్శ‌కుడిగా, నిర్మాత‌గా అంచెలంచెలుగా ఎదిగారు.

త‌న‌దైన ముద్ర ఉండేలా జాగ్ర‌త్త ప‌డ్డారు. ఒక ర‌కంగా చెప్పాలంటే నిర్మాత‌ల‌కు క‌ల్ప‌త‌రువుగా త‌న ప‌ద్మాల‌య స్టూడియోను తీర్చిదిద్దారు. సినిమా ఆడ‌లేదంటే తాను నొచ్చుకునే వారు. ఆ త‌ర్వాత అదే నిర్మాత‌ల‌కు కాల్ షీట్స్ ఇచ్చే వారు. ఇది సూప‌ర్ స్టార్ కు ఉన్న ఘ‌న‌మైన చ‌రిత్ర‌.

రెండు లేదా మూడు సినిమాలు స‌క్సెస్ అయితే త‌మ‌ను మించిన వారు లేర‌ని మిడిసి ప‌డే న‌టులు ఉన్న ఈ రోజుల్లో 350కి పైగా సినిమాల‌లో న‌టించి ఎంద‌రికో జీవితాన్ని ఇచ్చిన సూప‌ర్ స్టార్ ఎప్ప‌టికీ సామాన్యుడిగా ఉండేందుకే ఇష్ట‌ప‌డ్డారు.

ఎంపీగా ఉన్నా సాధార‌ణంగా ఉండ‌డంలోనే సంతృప్తి ఉంటుంద‌ని భావించారు. అందుకే ఆయ‌న రియ‌ల్ సూప‌ర్ స్టార్ అయ్యారు. ఆయ‌న మ‌ర‌ణం సినిమా రంగానికి ఇరు తెలుగు రాష్ట్రాల‌కు తీర‌ని లోటు.

TeluguISM - Super Star Krishna

Also Read : ఎస్పీబీని ప్రోత్స‌హించిన సూప‌ర్ స్టార్

Leave A Reply

Your Email Id will not be published!