Navadeep : డ్రగ్స్ కేసులో నవదీప్ పేరు
వెల్లడించిన సీపీ సీవీ ఆనంద్
Navadeep : హైదరాబాద్ – తీగ లాగితే డొంకంతా కదులుతోంది. మరోసారి డ్రగ్స్ వ్యవహారం కలకలం రేపుతోంది. తాజాగా తెలుగు సినీ రంగానికి చెందిన కొందరు పేర్లు గతంలో బయట పడ్డాయి. అప్పట్లో దగ్గుబాటి రానా, రవితేజ, దర్శకుడు పూరీ జగన్నాథ్, నటి రకుల్ ప్రీత్ సింగ్ ను విచారించారు. తాజాగా కొత్త పేరు వెలుగులోకి వచ్చింది. నటుడు నవదీప్(Navadeep) ఉన్నాడని సాక్షాత్తు హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ వెల్లడించారు.
Navadeep Name Viral
తాజాగా భారీ ఎత్తున డ్రగ్స్ రాకెట్ ను పట్టుకున్నారు. వారిలో అరెస్ట్ అయిన రామచంద్ర హీరో నవదీప్ కూడా ఉన్నట్లు తమకు చెప్పాడని తెలిపారు. మాదాపూర్ ఫ్రెష్ లివింగ్ అపార్ట్మెంట్ పై హైదరాబాద్ నార్కోటిక్స్ పోలీసులు దాడులు చేశారు.
ఈ కేసులో ఫిలిం ఫైనాన్షియర్ వెంకట్ తో పాటు పలువురిని అదుపులోకి తీసుకున్నారు. మరికొందరు పరారీలో ఉన్నారని తెలిపారు. నవదీప్ తో కలిసి డ్రగ్స్ పార్టీ నిర్వహించామని, ఆయనతో కలిసి తాను కూడా మత్తు పదార్థాలు తీసుకున్నామని రామచంద్ర చెప్పాడంటూ సీపీ వెల్లడించారు.
ఇదిలా ఉండగా 2017న టాలీవుడ్ డ్రగ్స్ కేసులో హీరో నవదీప్ దర్యాప్తు సంస్థల ముందు హాజరయ్యాడు కూడా. సిటీలో మనోడు పబ్ కూడా నడుపుతున్నాడు. తను పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు. అతడిని 29వ నిందితుడిగా చేర్చింది.
Also Read : Ram Gopal Varma : పవన్ కళ్యాణ్ పై ఆర్జీవీ సెటైర్