Prabhas Adipurush : తిరుప‌తిలోనే ముహూర్తం – ప్ర‌భాస్

ఇక్క‌డే పెళ్లి చేసుకుంటాన‌ని ప్ర‌క‌ట‌న

Prabhas Adipurush  : పాన్ ఇండియా న‌టుడు ప్ర‌భాస్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. గ‌త కొంత కాలం నుంచి ఆయ‌న పెళ్లి చేసుకుంటారంటూ పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రిగింది. ప్ర‌త్యేకించి కృతి స‌న‌న్ మాయ‌లో ప‌డి పోయాడ‌ని, వారిద్ద‌రూ ల‌వ్ లో ప‌డ్డార‌ని టాక్. ఇది ప‌క్క‌న పెడితే ఇతిహాసం రామాయ‌ణం ఆధారంగా ఔం రౌత్ ద‌ర్శ‌క‌త్వంలో ఆదిపురుష్(Adipurush) చిత్రంలో ప్ర‌భాస్, కృతి స‌న‌న్ క‌లిసి న‌టించారు. ఇందుకు సంబంధించి టీజ‌ర్ , ట్రైల‌ర్ ఇప్ప‌టికే విడుద‌ల చేశారు. భారీ స్పంద‌న వ‌చ్చింది.

ఇక దేవ దేవుడు, క‌లియుగ దైవం శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామి, అలివేలు మంగ‌మ్మ కొలువు తీరిన తిరుమ‌ల సాక్షిగా ఆది పురుష్(Adipurush) చిత్రం ప్రీ రిలీజ్ వేడుక‌లు అంగ రంగ వైభ‌వంగా జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథులుగా జ‌గ‌ద్గురువు శ్రీ‌శ్రీ‌శ్రీ త్రిదండి రామానుజ చిన్న జీయ‌ర్ స్వామి, తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం చైర్మ‌న్ వైవీ సుబ్బారెడ్డి హాజ‌ర‌య్యారు.

ఈ సంద‌ర్భంగా శ్రీ‌శ్రీ‌శ్రీ త్రిదండి రామానుజ చిన్న జీయ‌ర్ స్వామి మంగ‌ళా శాస‌నాలు అందించారు. సినిమా విజ‌య‌వంతం కావాల‌ని ఆకాంక్షించారు. అనంత‌రం జాన‌కి పాత్ర‌లో జీవించిన కృతి స‌న‌న్ మాట్లాడుతూ ఇది అంద‌రి సినిమా అని, స‌క్సెస్ చేయాల‌ని కోరారు.

న‌టుడు ప్ర‌భాస్(Prabhas) సంచ‌లన ప్ర‌క‌ట‌న చేశారు. అభిమానుల‌కు ఖుష్ క‌బ‌ర్ చెప్పారు. తాను తిరుప‌తిలోనే పెళ్లి చేసుకుంటాన‌ని స్ప‌ష్టం చేశాడు. కానీ ఎప్పుడు చేసుకుంటాన‌నేది మాత్రం చెప్ప‌లేదు. మొత్తంగా డార్లింగ్ త‌న పెళ్లిపై బ‌య‌ట ప‌డడంతో ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు.

Also Read : CM KCR : దేశానికి ఆద‌ర్శం తెలంగాణ ప్ర‌భుత్వం

Leave A Reply

Your Email Id will not be published!