R Madhavan : మోదీ డిజిటల్ భారతం ప్రశంసనీయం
ప్రధాన మంత్రికి కితాబు ఇచ్చిన మాధవన్
R Madhavan : భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై ప్రశంసల జల్లులు కురిపించాడు ప్రముఖ కోలీవుడ్ నటుడు ఆర్. మాధవన్. కేన్స్ ఫెస్టివల్ లో ముఖ్య అతిథిగా పాల్గొన్న నటుడు పీఎంను ఆకాశానికి ఎత్తేశారు.
సమున్నత భారత దేశంలో మోదీ కొలువు తీరాక తీసుకు వచ్చిన డిజిటల్ భారతం కొత్త దారులకు స్వాగతం పలికిందన్నారు. ఇవాళ స్మార్ట్ ఫోన్ తో మరింత చేరువయ్యేలా చేశారని కితాబు ఇచ్చారు.
ఒకప్పుడు సామాన్యుడి నుంచి ధనవంతుల దాకా రోజూ వారీ కార్యకలాపాలు చేసు కోవాలంటే చాలా ఇబ్బంది ఉండేదని కానీ మోదీ తీసుకున్న ఒకే ఒక్క నిర్ణయం కోట్లాది భారతీయులకు ఎంతో సౌకర్యవంతంగా, ఉప యుక్తంగా మారిందన్నారు.
ఇవాళ ప్రతి ఒక్కరు స్మార్ట్ ఫోన్ తో కష్టమైన పనుల్ని సులువుగా చేసుకుంటున్నారంటూ పేర్కొన్నారు. ఒకప్పుడు భారత్ పట్ల చిన్న చూపు చూసిన యావత్ ప్రపంచం డిజిటల్ ఇండియాను చూసి నివ్వెర పోతోందని చెప్పారు.
డిజిటల్ లావాదేవీలలో వరల్డ్ లోనే టాప్ లో భారత్ ఉందని, దీనికంతటికీ ప్రధాన మంత్రి మోదీనేనని స్పష్టం చేశారు నటుడు ఆర్. మాధవన్(R Madhavan). మోదీ సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం భారత దేశంలో సూక్ష్మ ఆర్థిక వ్యవస్థ విజయవంతం అయ్యిందని చెప్పారు.
నవ భారత దేశం తనకు కనిపిస్తోందన్నారు. కరోనా తో ఇతర దేశాలు భయానికి లోనైతే భారత్ కఠోర పరీక్షను ఎదుర్కొని నిలిచిందన్నారు మాధవన్(R Madhavan).
ప్రస్తుతం నటుడు చేసిన కామెంట్స్ ప్రస్తుతం హల్ చల్ గా మారాయి. ఆయన మాట్లాడిన వీడియోను కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ షేర్ చేశారు.
Also Read : కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ భారత్ కు ప్రత్యేకం