Sonu Sood : నటుడిగా, సామాజిక సేవలో ముందంజలో ఉన్న ఏకైక నటుడు సోనూ సూద్(Sonu Sood ). ఆయన కరోనా కాలంలో మరింత పేరు పొందారు. తెర మీద విలనిజం ప్రదర్శించే ఈ యాక్టర్ సేవలో మాత్రం టాప్ . అదే అతడిని టాప్ లో ఉండేలా చేసింది.
ఎప్పుడైతే దేశంలో లాక్ డౌన్ విధించారో ఈ హీరో రియల్ హీరోగా మారి పోయాడు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు చేయలని సాహసాన్ని చేశాడు. ఒక వ్యక్తి శక్తిగా ఎలా మారాడో యావత్ ప్రపంచం చూసింది.
ఆయన సేవా తత్పరతను చూసి మెచ్చుకుంది. సోనూ సూద్ (Sonu Sood )పై రాళ్లు వేశారు. ఐటీ పేరుతో దాడులకు దిగారు. కానీ ఏవీ ఆయనను కదిలించ లేక పోయారు.
కోట్లాది రూపాయలు పోగేసుకున్న వాళ్లు సీఎస్ఆర్ పేరుతో దొంగ లెక్కలు ఎలా ట్యాక్స్ ఎగవేస్తున్నారో జనానికి తెలుసు. నిరుపేదలు, అన్నార్థులు, ఆకలితో ఉన్న వారికి సోనూ సూద్ ఆసరాగా నిలిచాడు.
పేదలకు చేతి కర్రగా మారాడు. ఒక రకంగా చెప్పాలంటే ఆయన కనిపించే దేవుడిగా చాలా మంది కొలుస్తున్నారు. తాజాగా సోనూ సూద్ చేసిన సామాజిక సేవా కార్యక్రమాలను గుర్తించింది దుబాయ్ ప్రభుత్వం.
ఈ మేరకు గౌరవార్థంగా ఆ సర్కార్ యూఏఈ గోల్డెన్ వీసాను ఎంపిక చేసింది. ఈ సందర్భంగా దుబాయ్ లో జరిగిన కార్యక్రమంలో నటుడు సోనూ సూద్ ను సత్కరించింది వీసాను అందజేసింది.
తనకు గోల్డెన్ వీసా అందజేసిన యూఏఈ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు సోనూ సూద్.
Also Read : తన స్ధావరం కోల్కతాకు మారుస్తున్న యశోద