Varun Tej Lavanya Tripathi : 9న వరుణ్ లావణ్య నిశ్చితార్థం
మెగా ఇంట ఇక పెళ్లి బాజాలు
Varun Tej Lavanya Tripathi : ఎట్టకేలకు వరుణ్ తేజ్ తన ప్రేమ విషయంలో బయట పడ్డాడు. గత కొంత కాలం నుంచీ హీరోయిన్ లావణ్య త్రిపాఠి తో ప్రేమలో ఉన్నట్టు ప్రచారం జరిగింది. అయితే ఎక్కడా ఇందుకు సంబంధించి తన మనసులోని మాటను బయట పెట్టలేదు. సినిమాల విషయంలోనూ, పాత్రల ఎంపికలోనూ వరుణ్ తేజ్ కొంచెం డిఫరెంట్.
తాజాగా జూన్ 9న వరుణ్ తేజ్ , లావణ్య త్రిపాఠికి సంబంధించి నిశ్చితార్థం కన్ ఫర్మ్ అయ్యింది. దీంతో ఇద్దరికి చెందిన అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ప్రస్తుతం వరుణ్ తేజ్ , లావణ్య(Varun Tej Lavanya Tripathi) పారిస్ లో ఉన్నారు. సెలవులను ఎంజాయ్ చేస్తున్నట్లు సమాచారం.
ఈ కార్యక్రమానికి మెగా ఫ్యామిలీ మొత్తం హాజరు కానుంది. ఇదిలా ఉండగా వారం రోజుల కిందట లావణ్య త్రిపాఠి ఎయిర్ పోర్ట్ నుండి ఒక సెల్ఫీని పంచుకుంది. దానికి సంబందించి ట్రావెల్ మోడ్ అని క్యాప్షన్ జత చేర్చింది. లొకేషన్ స్పాట్ ఏది అని చెప్పనప్పటికీ వరుణ్ తేజ్ కూడా సెలవులో ఉండడం తో ఇద్దరూ కలిసి పారిస్ లో ఎంజాయ్ చేస్తున్నారని టాక్. ఇద్దరూ కలిసి జూన్ 2న హైదరాబాద్ కు రానున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. మెగా వారి ఇంట మరో పెళ్లి బాజా మోగ బోతోందన్నమాట.
అయితే వరుణ్ తేజ్ కు ఎక్కువగా పేరు తీసుకు వచ్చిన సినిమా ఎఫ్ -1 సినిమా. శేఖర్ కమ్ముల తీసిన మూవీ. అందులో సాయి పల్లవి నటించింది.
Also Read : YS Sharmila