Jayaprada Yogi : యోగి పాల‌న అద్భుతం – జ‌య‌ప్ర‌ద

ఆయ‌న ప‌నితీరు సూప‌ర్

Jayaprada Yogi : ప్ర‌ముఖ న‌టి జ‌య‌ప్ర‌ద ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఉత్త‌ర ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి యోగి ఆదిత్యా నాథ్ పై ప్ర‌శంస‌ల జ‌ల్లులు కురిపించారు. సీఎంను స్వ‌యంగా జ‌య‌ప్ర‌ద(Jayaprada) త‌న సీఎం క్యాంపు ఆఫీసులో క‌లుసుకున్నారు. ఈ సంద‌ర్బంగా యోగికి పుట్టిన రోజు అభినంద‌న‌లు తెలిపారు. ఇదే స‌మ‌యంలో యోగి ఆదిత్యా నాథ్ కు ప్ర‌త్యేకంగా ధ‌న్య‌వాదాలు తెలిపారు.

మీ నాయ‌క‌త్వంలో ఉత్త‌ర ప్ర‌దేశ్ ప్ర‌స్తుతం అన్ని రంగాల‌లో త‌నదైన ముద్ర క‌న‌బ‌రుస్తోంద‌ని కితాబు ఇచ్చారు. గ‌తంలో లా అండ్ ఆర్డ‌ర్ కంట్రోల్ లో ఉండేది కాద‌న్నారు. కానీ ఇప్పుడు సీన్ మారింద‌న్నారు. పెట్టుబడిదారుల‌కు యూపీ రాష్ట్రాన్ని కేరాఫ్ గా మార్చిన ఘ‌న‌త యోగి ఆదిత్యా నాథ్ కే ద‌క్కుతుంద‌న్నారు.

ఇలాంటి నాయ‌కులే దేశానికి కావాల‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. తాను త‌న జీవిత కాలంలో ఎంతో మంది నాయ‌కుల‌ను, సీఎంల‌ను, కేంద్ర మంత్రుల‌ను చూశాన‌ని కానీ యోగి లాంటి నిరాడంబ‌ర‌మైన వ్య‌క్తిని చూడ‌లేద‌న్నారు. ఎక్క‌డా ఆయ‌న తాను సీఎం న‌న్న అహం కూడా లేక పోవ‌డం త‌న‌ను ఆశ్చ‌ర్య పోయేలా చేసింద‌న్నారు న‌టి జ‌య‌ప్ర‌ద‌. ఇదిలా ఉండ‌గా జ‌య‌ప్ర‌ద గ‌తంలో యూపీ నుంచి పోటీ చేశారు. స‌మాజ్ వాది పార్టీ త‌ర‌పున‌. టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లో కూడా ప‌లు సినిమాల‌లో న‌టించారు. ప్ర‌స్తుతం జ‌య‌ప్ర‌ద చేసిన వ్యాఖ్య‌లు సీఎం గురించి అత్యంత ప్రాధాన్య‌త సంత‌రించుకున్నాయి.

Also Read : Bhupesh Baghel

Leave A Reply

Your Email Id will not be published!