Suhasini Mulay Gautam : గౌతమ్ నవ్లాఖాకు నటి ములే పూచీకత్తు
18న విచారించనున్న సుప్రీంకోర్టు
Suhasini Mulay Gautam : దేశ వ్యాప్తంగా సంచలనం కలిగించింది గోరేగావ్ కేసు. ఇందులో పేరొందిన ప్రముఖులను జైలు పాలు చేసింది కేంద్రం. దేశంలో కమ్యూనిజం, వామపక్షం, నక్సలిజం ఏదీ ఉండ కూడదనే ఉద్దేశంతో ఉక్కుపాదం మోపుతోంది. ప్రత్యేకించి ప్రజా సంఘాలు, పౌర సమాజాన్ని ప్రశ్నించనీయకుండా చేస్తోందన్న ఆరోపణలు ఉన్నాయి.
ఇందులో భాగంగా ఇప్పటికే అరెస్టై జైలులో ఉన్న ప్రముఖ ఉద్యమకారుడు గౌతమ్ నవ్లాఖా తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతున్నారు. ఇప్పటికే సుప్రీంకోర్టు ఆయనను గృహ నిర్బంధంలో ఉంచేలా పర్మిషన్ ఇచ్చింది. దీనిని సవాల్ చేస్తూ సొలిసిటర్ జనరల్ అఫిడవిట్ సమర్పించారు.
నవ్లాఖా తన ఇంటి చిరునామా ఇవ్వలేదని కమ్యూనిస్టు పార్టీ ఆఫీసు అడ్రస్ ఇచ్చారంటూ ఆరోపించారు. ఇదిలా ఉండగా ముంబై కోర్టులో గౌతమ్ నవ్లాఖాకు ప్రముఖ నటి సుహాసిని ములే (Suhasini Mulay Gautam) పూచీకత్తు ఇచ్చారు. ప్రస్తుతం ఆమె హాట్ టాపిక్ గా మారారు.
ఇదిలా ఉండగా గౌతమ్ నవ్లాఖా ఢిల్లీకి చెందిన వారని, ఆయన తనకు దాదాపు 30 ఏళ్ల నుంచి పరిచయంద ఉందన్నారు నటి సుహాసిని ములే. ఇక్కడ కూడా తాను కొంత కాలం పాటు ఉంటున్నట్లు తెలిపారు.
ఇక ఎల్గార్ పరిషత్ కేసులో నిందితుడిగా ఉన్నారు ఉద్యమకారుడైన గౌతమ్ నవ్లాఖా. ఆయనకు పూచీకత్తు ఇచ్చేందుకు గాను ప్రముఖ నటి సుహాసిని ములే ముంబైలోని ప్రత్యేక కోర్టుకు హాజరయ్యారు.
ఇదిలా ఉండగా ఒక నెల పాటు గృహ నిర్భందంలో ఉంచాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. కాగా రూ. 2 లక్షల స్థానిక పూచీకత్తు సమర్పించాలని కోర్టు ఆదేశించింది.
Also Read : 18న యాక్టివిస్ట్ గౌతమ్ నవ్లాఖా కేసు విచారణ