Urmila Matondkar Rahul Yatra : రాహుల్ యాత్రలో ‘ఊర్మిళ’
రాజకీయవేత్తగా మారిన ప్రముఖ నటి
Urmila Matondkar Rahul Yatra : ప్రముఖ బాలీవుడ్ నటి ఊర్మిలా మటోండ్కర్ సంచలనంగా మారారు. ఆమె భారత కాంగ్రెస్ పార్టీకి చెందిన అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో పాల్గొన్నారు. రాహుల్ గాంధీతో కలిసి అడుగులో అడుగు వేశారు. ఈ దేశానికి కావాల్సింది మతం కాదని ప్రేమ కావాలన్నారు ఊర్మిళ మటోండ్కర్.
ఆమె గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఊర్మిళ మటోండ్కర్ వయస్సు 48 ఏళ్లు. సెప్టెంబర్ 2019లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. 2020లో శివసేన బాల్ ఠాక్రే పార్టీలో చేరారు ఊర్మిళ మటోండ్కర్(Urmila Matondkar). ఇదిలా ఉండగా రాహుల్ చేపట్టిన యాత్ర ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్ లో కొనసాగుతోంది.
దాడుల మధ్య భారీ ఎత్తున సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. జమ్మూ లోని గ్యారీసన్ పట్టణం నగ్రోటా నుండి మంగళవారం తిరిగి ప్రారంభమైంది. ఈ క్రమంలో నటి ఊర్మిళా మటోండ్కర్ రాహుల్ గాంధీతో జత కట్టారు. భారత్ జోడో యాత్ర దేశంలో కీలకమైన ఘట్టంగా పేర్కొన్నారు.
ఇలాంటి యాత్రలు మరిన్ని చేపట్టాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు రాజకీయవేత్తగా మారిన నటి. ఈ సందర్బంగా పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు ఊర్మిళ మటోండ్కర్ కు ఘన స్వాగతం పలికారు.
ఆమెతో పాటు ప్రముఖ రచయిత పెరుమాళ్ మురుగన్ , జమ్మూ కాశ్మీర్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ వికార్ రసూల్ వానీ , జీఏ మీర్, మాజీ మంత్రి అబ్దుల్ హమీద్ కర్రా కూడా చేరారు. రాహుల్ గాంధీ యాత్రకు భారీ ఎత్తున జనం తరలి వస్తున్నారు.
Also Read : రాజస్థాన్ ఎన్నికల్లో బీజేపీదే రాజ్యం