Adani Group Repay : రుణాల తిరిగి చెల్లింపుపై అదానీ ఫోకస్
హిండెన్ బర్గ్ రిపోర్ట్ దెబ్బకు షేర్ల పతనం
Adani Group Repay : అమెరికా రీసెర్చ్ సంస్థ దెబ్బకు అదానీ గ్రూప్ షేర్ వాల్యూ భారీగా తగ్గింది. ఊహించ లేనంత షాక్ కు గురైంది. దీంతో ఇన్వెస్టర్ల నమ్మకం సడలకుండా ఉండేందుకు దిద్దుబాటు చర్యలకు దిగారు అదానీ గ్రూప్ సంస్థల చైర్మన్ గౌతమ్ అదానీ. ఈ మేరకు మదుపుదారులకు మేలు చేకూర్చేందుకు గాను $780 మిలియన్ల రుణాలను తిరిగి చెల్లించాలని(Adani Group Repay) నిర్ణయించింది. ఇక హిండెన్ బర్గ్ రీసెర్చ్ జనవరి 24న ప్రకటించన నివేదిక కారనంగా ఏడు లిస్టెడ్ అదానీ గ్రూప్ కంపెనీలు మార్కెట్ విలువలో $140 బిలియన్లకు పైగా నష్ట పోయాయి.
ఇక వచ్చే మార్చి నాటికి $690 మిలియన్ల నుండి $790 మిలియన్ల విలువైన షేర్ బ్యాక్డ్ లోన్లను ముందస్తుగా చెల్లించాలని యోచిస్తోంది. ఈ విషయంపై అవగాహన ఉన్న ఇద్దరు వ్యక్తులు రాయిటర్స్ తో చెప్పినట్లు సమాచారం. చిన్న విక్రయదారుల నుండి విపరీతమైన ఒత్తిళ్ల నేపథ్యంలో ఈ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. షేరు ధర పతనం, రెగ్యులేటరీ ప్రోబ్ మధ్య పెట్టుబడిదారుల విశ్వాసాన్ని పెంచేందుకు గ్రూప్ ఈ వారం సింగపూర్ , హాంకాంగ్ లలో స్థిర ఆదాయ రోడ్ షోను నిర్వహిస్తోంది.
అయినా అదానీ గ్రూప్ పై ఇంకా అనుమనాలు అలాగే ఉన్నాయి. మదుపరులు పెద్ద ఎత్తున తమ డబ్బులను వెనక్కి తీసుకునేందుకు ఎగబడుతుండడం విశేషం. ఇదే అదానీ గ్రూప్ ను విస్తు పోయేలా చేసింది. ఇప్పటి వరకు గౌతమ్ అదానీ(Adani Group) ఈ విషయంపై ఎక్కడా నోరు విప్పలేదు.
అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ తన 2024 బాండ్లను $800 మిలియన్లను మూడేళ్ల క్రెడిట్ లైన్ ద్వారా రీ ఫైనాన్స్ చేయాలని కూడా యోచిస్తున్నట్లు రాయిటర్స్ వెల్లడించింది.
Also Read : ప్రపంచ కుబేరుల్లో మస్క్ నెంబర్ వన్