Adila Nasrin Fathima Engaged : లెస్బియన్లు ఒక్కటయ్యారు
ఆదిలా నసరీన్..ఫాతిమా నూరా
Adila Nasrin Fathima Engaged : సమాజం మారుతోంది. ఆచారాలు, వ్యవహారాలు మారుతున్నాయి. టెక్నాలజీలో పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇక గే, లెస్బియన్లు తమకు స్వేచ్ఛ కావాలని కోరుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఎల్జీబీటీ ఉద్యమాలు కొనసాగుతూనే ఉన్నాయి. తమకు తోచిన రీతిలో తాము బతికే హక్కు ఉందని వారంటున్నారు.
ఒకప్పుడు స్వలింగ సంపర్కం పేరుతో సంబంధాలు కలిగి ఉండడం నేరంగా భావించే వారు. కానీ సీన్ మారింది.. సిట్యూయేషన్ కూడా మారింది. ప్రస్తుతం కేరళకు చెందిన ఆదిలా నసరీన్ , ఫాతిమా నూరా(Adila Nasrin Fathima Engaged) వ్యవహారం చర్చకు దారి తీసింది. సోషల్ మీడియాలో వీరు వైరల్ గా మారారు.
ఇరువురూ ఇవాళ కీలక ప్రకటన చేశారు. తామిద్దరం వధూవరులుగా మారామని, ఒక్కటయ్యామంటూ ప్రకటించారు. గత కొంత కాలం పాటు సహజీవనం చేశారు. ఈ ఇద్దరినీ వారి వారి పేరెంట్స్ విడదీశారు. తాము మేజర్లమని తమను విడదీసే హక్కు తమ తల్లిదండ్రులకు లేదంటూ కేరళ కోర్టును ఆశ్రయించారు.
సహజీవనం చేసే హక్కు, స్వేచ్ఛ వారికి ఉందని గత మే నెలలో కేరళ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. నూరా, సనరీన్ లకు గ్రీన్ సిగ్నల్ లభించింది. తాజాగా ఎర్నాకులం జిల్లాలోని సముద్ర తీరంలో ఈ ఇద్దరు ఉంగరాలు, దండలు మార్చుకున్నారు..ఒక్కటయ్యామని ప్రపంచానికి తెలిపారు.
ఇందుకు సంబంధించిన ఫోటోలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు హల్ చల్ చేస్తున్నాయి.
Also Read : మెటా ఇండియా హెడ్ గా ‘దేవనాథన్’