Afghan Women Fight : తాలిబన్ల తీరుపై ‘ముబారెజ్’ కన్నెర్ర
చదువు కోకుండా బాలికలపై నిషేధంపై ఫైర్
Afghan Women Fight : యావత్ ప్రపంచంలో బాలికలు, యువతులు చదువు కోకుండా నిషేధం విధించిన ఏకైక దేశం ఆఫ్గనిస్తాన్. తాలిబన్లు కైవసం చేసుకుని ఏడాది కాలం పూర్తయింది.
ఈరోజు వరకు బాలికలు, యువతులు, మహిళల పట్ల తాలిబన్లు వివక్ష చూపుతున్నారు. వారిని చదువుకు దూరం చేశారు. ఇదే విషయాన్ని ఐక్య రాజ్య సమితి తీవ్రంగా తప్పు పట్టింది.
పాశ్చాత్య దేశాలు కూడా ఆగ్రహం వ్యక్తం చేశాయి. విద్యతోనే వికాసం అలవడుతుందని, బతికేందుకు కావాల్సిన బలాన్ని, ధైర్యాన్ని ఇస్తుందని ప్రపంచం నమ్ముతోంది.
కానీ కరడు గట్టిన ఇస్లాం వాదంతో ఉన్న తాలిబన్లు వాటినేవీ పట్టించు కోవడం లేదు. కానీ పాశ్చాత్య మద్దతుతో 20 ఏళ్ల పాలనలో మహిళలు తమ
హక్కుల కోసం ప్రధానంగా స్వేచ్ఛ, చదువు కోసం పోరాడుతూ వచ్చారు.
కానీ వారిపై దాడులకు దిగారు. ఆపై చంపేశారు. ఇంకొందరిని నామ రూపాలు లేకుండా చేశారు. ఆయుధాలను మాత్రమే నమ్ముకున్న తాలిబన్లకు దేశాన్ని నడపడం కత్తి మీద సాములాగా మారింది.
ఇక ఆఫ్గాన్ పై మరోసారి ధిక్కార స్వరాన్ని వినిపిస్తూ వస్తోంది మోనేసా ముబారెజ్. తాలిబన్లు అధికారంలోకి రాక ముందు ఆమె ఆర్థిక మంత్రిత్వ శాఖలో పాలసీ మానిటరింగ్ డైరెక్టర్ గా పని చేశారు.
చాలా మంది మహిళలను ఉద్యోగాల్లోంచి తొలగించింది. దేశ వ్యాప్తంగా బాలికలకు సెకండరీ పాఠశాలలను మూసి వేసింది. కొత్త కేబినెట్ లో
మహిళలకు చోటు లేకుండా చేసింది.
ఈ సందర్భంగా ముబారెజ్ ధిక్కార స్వరాన్ని వినిపిస్తున్నారు. ఒక యుద్దం ముగిసింది కానీ ఆఫ్గన్ మహిళల (Afghan Women Fight) స్వేచ్చ కోసం మరో యుద్దం ప్రారంభమైందన్నారు.
ప్రతి అన్యాయానికి వ్యవతిరేకంగా తమ గొంతు వినిపిస్తూనే ఉంటామని ప్రకటించారు. ఈ సందర్భంగా యుఎన్ మహిళల దేశ ప్రతినిధి
అలిసన్ డేవిడియన్ స్పందించారు.
ముబారజ్ లాంటి మహిళలు దేశంలో తమ స్వరాన్ని ప్రకటిస్తున్నారని అన్నారు. ముబారెజ్ లాంటి కథలు ఎన్నో ఉన్నాయన్నారు. విచిత్రం
ఏమిటంటే ఎక్కడికి వెళ్లినా మహిళల వెంట ఒక పురుషుడు తప్పనిసరిగా ఉండాలని తాలిబన్లు ఆదేశించారు.
మొత్తంగా తాలబిన్ల తీరుపై మహిళలు ఒక్కటవుతున్నారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Also Read : దైవం పేరుతో బీజేపీ భూ దందా