Afghanistan India : భారత్ కు భరోసా ఉగ్ర మూకలపై నిఘా
పాక్ మిలిటెంట్లను సహించబోం
Afghanistan India : తాలిబన్లు స్వాధీనం ఆఫ్గనిస్తాన్ ను స్వాధీనం చేసుకున్నప్పటికీ ఇంకా అంతర్జాతీయ సమాజం గుర్తింపునకు నోచుకోలేదు. మరో వైపు తీవ్ర ఆర్థిక, ఆహార సంక్షోభంలో నెలకొన్న ఆఫ్గనిస్తాన్ ను పాకిస్తాన్ పట్టించు కోలేదు.
కానీ భారత దేశం మానవతా దృక్ఫథంతో భారీ ఎత్తున నాణ్యమైన గోధుమలు, కరోనా నివారణ కోసం వ్యాక్సిన్లు, అవసరమైన మందుల్ని సరఫరా చేసింది. ఇదే సమయంలో తాలిబన్లు దాడి చేసిన సమయంలో భారత(Afghanistan India) ఎంబీసీని మూసి వేశారు.
దీంతో ఆఫ్గనిస్తాన్ ను ఏలుతున్న తాలిబన్లు భారత్ తో సత్ సంబంధాలు కోరుకుంటున్నారు. ఇదే విషయాన్ని ఆ దేశానికి చెందిన అత్యున్నత నాయకుడు ముత్తాఖి స్పష్టం చేశారు.
ఇదిలా ఉండగా ఇటీవల అల్ ఖైదా లాంటి ఉగ్ర మూకలు, పాక్ తోడ్పాటుతో పేట్రేగి పోతున్న ఉగ్ర మూకలు భారత్(Afghanistan India) పై దాడి చేయకుండా ఉండేందుకు కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టమైన హామీ కూడా ఇచ్చినట్లు సమాచారం.
ఇంటెలిజెన్స్ ఆధారంగా వారి పని పడతామని హెచ్చరించింది. గత వారం కాబూల్ లో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సమావేశం జరిగింది.
తాలిబన్ అగ్ర నాయకత్వం భారత్ కు తమ నేల నుండి మూడో దేశంపై ఉగ్రవాదాన్ని అనుమతించ బోదంటూ స్పష్టం చేసింది.
తాలిబాన్ ప్రభుత్వ ఆహ్వానం మేరకు విదేశాంగ శాఖ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాఖీతో పాటు రక్షణ మంత్రి ముల్లా యాకూబ్ , అంతర్గత మంత్రి సిరాజుద్దీన్ హక్కానీని భారత ప్రతినిధి బృందం నాయకుడు జేపీ సింగ్ కలుసుకున్నారు ఇటీవల.
పాకిస్తాన్ లో ఉన్న జైష్ ఎ మొహమ్మద్ , లష్కరే ఇ తోయిబా , హిజ్బుల్ ముజాహిదీన్ వంటి సంస్థలపై నిఘా పెడతామని హామీ ఇచ్చింది.
Also Read : లంకకు సాయంపై భారత్ కు చైనా కితాబు