Afridi : భారత స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ తాను టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించడంపై తాజా, మాజీ ఆటగాళ్లు ప్రపంచ వ్యాప్తంగా స్పందిస్తున్నారు.
ఇప్పటికే పాకిస్తాన్ మాజీ వికెట్ కీపర్ రషీద్ లతీఫ్ అయితే ఏకంగా ఇద్దరు దిగ్గజ ఆటగాళ్ల మధ్య నెలకొన్న ఆధిపత్య పోరు వల్లనే కోహ్లీ అర్దాంతరంగా తప్పుకున్నాడంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈ తరుణంలో అదే దేశానికి చెందిన మాజీ క్రికెటర్ షాహిది అఫ్రిది (Afridi )ఇవాళ స్పందించాడు. విరాట్ కోహ్లీ సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నాడంటూ ప్రశంసించాడు. ఆ మేరకు ఆసక్తికర వ్యాఖ్యలు కూడా చేశాడు.
అదేమిటంటే ఆట అన్నాక ఒడిదుడుకులు సహజమని పేర్కొన్నాడు. అంతే కాకుండా ప్రతి ఆటలో ఆటగాళ్లకు ప్రతి ఒక్కరికీ ఒక దశలో ఒత్తిడిని తట్టుకోలేని పరిస్థితి కలుగుతుందన్నాడు.
సఫారీ టూర్ లో ఉన్న భారత జట్టు టెస్టు సీరీస్ ను 2-1 తేడాతో కోల్పోయింది. ఈ తరుణంలో ఉన్నట్టుండి తాను తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు విరాట్ కోహ్లీ.
ఒక్కరొక్కరు కోహ్లీ నిష్క్రమణ నిర్ణయంపై తోచిన అభిప్రాయాలను పంచుకుంటున్నారు. కోహ్లీ అద్భుతమైన ఆటగాడుగా పేర్కొంటూనే ఇలాంటి నిర్ణయం తీసుకుంటాడని అనుకోలేదని పేర్కొన్నాడు అఫ్రిది.
అయితే అతడికి మంచి భవిష్యత్తు ఉందని అభిప్రాయం వ్యక్తం చేశాడు. 33 ఏళ్ల వయసున్న కోహ్లీ సుదీర్ఘ ఫార్మాట్ లో జట్టుకు ఎన్నో విజయాలు అందించాడని కితాబు ఇచ్చాడు.
ఏడేళ్ల కాలంలో తన జట్టును అద్భుతంగా తీర్చిదిద్దేందుకు కృషి చేశాడని పేర్కొన్నాడు అఫ్రిది.
Also Read : భారత్ బౌలింగ్ అటాకింగ్ గ్రేట్