Afsana Khan NIA : సిద్దూ కేసులో అఫ్సానా ఖాన్ విచారణ
5 గంటల పాటు ఎన్ఐఏ ప్రశ్నల వర్షం
Afsana Khan NIA : దేశ వ్యాప్తంగా సంచలనం కలిగించింది పంజాబ్ కు చెందిన ప్రముఖ సింగర్, కాంగ్రెస్ నాయకుడు సిద్దూ మూసేవాలా హత్య కేసు. దీని వెనుక లారెన్స్ గ్యాంగ్ ముఠా ప్రమేయం ఉందని అనుమానించింది. ఇప్పటికే కేసులు నమోదు చేశారు. కొందరిని అదుపులోకి తీసుకున్నారు.
తాజాగా సింగర్ సిద్దూ కేసుకు సంబంధించి మరో కీలక అంశం వెలుగు చూసింది. పంజాబీ గాయాని అఫ్సానా ఖాన్(Afsana Khan) పేరు బయటకు రావడం కలకలం రేపింది. ఈ కేసుకు సంబంధించి ఆమెకు కూడా లింకు ఉన్నట్లు జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ అనుమానం వ్యక్తం చేసింది. ఈ మేరకు అఫ్సానా ఖాన్ ను విచారించింది.
ఏకంగా 5 గంటల పాటు ఏకబిగిన ప్రశ్నల వర్షం కురిపించింది. లారెన్స్ గ్యాంగ్ తో పాటు , మూసేవాలా హత్య కేసులో కీలక సూత్రధారులతో అఫ్సానాకు ఉన్న సంబంధం ఏమిటనే దానిపై ఆరా తీసింది ఎన్ఐఏ(NIA).
ఇప్పటికే సదరు సంస్థ దాడులు చేసిన నేపథ్యంలో ఆమె పాత్ర కూడా అనుమానం వ్యక్తం చేసింది. కొన్ని విషయాలు వెలుగు చూడడంతో విచారించేందుకు గాను అఫ్సానా ఖాన్(Afsana Khan) కు సమన్లు జారీ చేసింది ఎన్ఐఏ.
సిద్దూ హత్య కేసులో కీలకంగా ఉన్న బంబిహా గ్యాంగ్ తో అఫ్సానా ఖాన్ క్లోజ్ గా ఉన్నట్లు గుర్తించింది. సిద్దూ హత్య, గ్యాంగ్ స్టర్ల తో పాటు ఉగ్రవాద కోణంలో సంబంధాలపై ప్రశ్నించినట్లు సమాచారం.
ఇదిలా ఉండగా ప్రముఖ సింగర్ గా వెలుగొందుతున్న అఫ్సానా ఖాన్ తనకు ఎలాంటి సంబంధం లేదంటోంది.
Also Read : డేరా బాబా పెరోల్ పై సీఎం దాటవేత