Lata Mangeshkar : ప్రపంచం మెచ్చిన దిగ్గజ స్వరాలలో ఒకరిగా పేరు పొందారు భారత (India) దేశానికి చెందిన దివంగత గాయని లతా మంగేష్కర్ . ఫిబ్రవరిలో ఆమె కాలం చేశారు. వేలాది పాటలు పాడి తనను తాను ప్రూవ్ చేసుకున్నారు ఆమె.
చివరి దాకా అవివాహితగానే ఉండి పోయారు. ఇక ప్రపంచ వ్యాప్తంగా అత్యంత పేరు పొందినవి ఆస్కార్ (Oscar) , గ్రామీ (Grammy) అవార్డులు. ప్రతి ఏటా ప్రకటిస్తారు.
ఇదే సమయంలో యావత్ సినీ సంగీతంలో పేరొందిన వారు కాలం చేస్తే వారి గురించి ఇన్ మెమోరియం పేరుతో స్మరించుకుంటారు. వారి వారి రంగాలలో సాధించిన విజయాలను గుర్తు చేస్తూ నివాళులు అర్పించడం ఆనవాయితీగా వస్తోంది.
ఇదిలా ఉండగా 2022లో జరిగిన ఆస్కార్ (Oscar) అవార్డుల ప్రదానోత్సవంలో కానీ తాజాగా జరిగిన గ్రామీ (Grammy) 2022 పురస్కారాల ప్రదానోత్సవంలో సైతం మిగతా వారందరికీ నివాళులు అర్పించారు.
కానీ భారత దేశం తరపున ప్రపంచ వ్యాప్తంగా కుల, మతాలకు అతీతంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న లతా మంగేష్కర్(Lata Mangeshkar )గురించి కానీ ఇటీవల కాలం చేసిన దిగ్గజ సంగీత దర్శకుడు బప్పీలహరి (Bappi Lahari) గురించి కానీ ప్రస్తావించ లేదు.
సరికదా స్మరించు కోలేదు. దీనిపై గురించి పెద్ద ఎత్తున సామాజిక మాధ్యమాలలో చర్చ జరుగుతోంది. ఆమె అభిమానులు గ్రామీ అవార్డుల కమిటీ నిర్వాహకులపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఒక రకంగా భారత్ (India) ను , లతాను అవమానించారంటూ మండి పడుతున్నారు. ట్విట్టర్ వేదికగా హోరెత్తిస్తున్నారు. క్షమాపణలు చెప్పాలని కోరుతున్నారు.
Also Read : 8న థియేటర్లలో రానున్న ‘గని’