AG Perarivalan : పెరరివాలన్ కంప్యూటర్ ఇంజనీర్..రచయిత
రాజీవ్ గాంధీ హత్య కేసులో 31 ఏళ్ల జైలు జీవితం
AG Perarivalan : భారత దేశ మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ దారుణ మరణం ఇంకా మరిచి పోలేదు ఈ దేశం. ఈ దారుణ ఘటన వెనుక ఎవరు ఉన్నారనేది ప్రస్తుతం మరోసారి చర్చకు వచ్చింది.
ఈ సందర్భంగా భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయ స్థానం ( సుప్రీంకోర్టు) కీలక తీర్పు ఇచ్చింది. ఇది దేశచరిత్రలో శాశ్వతంగా నిలిచి పోయే తీర్పు అని చెప్పక తప్పదన్నారు తమిళనాడు రాష్ట్ర సీఎం ఎంకే స్టాలిన్.
ఇవాల్టి తీర్పుతో 31 ఏళ్ల పాటు మరణ శిక్షకు గురై ఆ తర్వాత క్షమాభిక్ష పిటిషన్ తో జీవిత ఖైదు అనుభవించిన, ప్రధాన దోషిగా ఉన్నటువంటి ఏజీ పెరరివాలన్(AG Perarivalan) దేశ మంతటా వార్తల్లో వ్యక్తిగా నిలిచారు.
విడుదలైన అనంతరం పెరరివాలన్ కీలక వ్యాఖ్యలు చేశారు. న్యాయ పరిధిలో ఆయన మాట్లాడుతూనే ఉరి శిక్ష అంతిమం కాదని, అది సమస్యలను పరిష్కారం చూప జాలదంటూ స్పష్టం చేశారు.
దీని వెనుక ఎంతో ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇక ఏజీ పెరరివాలన్(AG Perarivalan) తమిళనాడు ఉద్యమాలకు పేరొందిన పెరియార్ భావజాలాన్ని పుణికి పుచ్చుకున్న వ్యక్తి. 30 జూలై 1971లో తమిళనాడులోని తిరుపత్తూరు జిల్లా జోలార్ పేటలో పుట్టాడు.
ఇతర పేరు అరివు. 2014లో జీవిత ఖైదుగా మార్చబడ్డాడు. ఆయనపై ప్రధాన నేరం మోపింది సీబీఐ. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీని చంపిన
బాంబును పేల్చేందుకు ఉపయోగించిన రెండు బ్యాటరీలను కొనుగోలు చేసి సరఫరా చేశాడని ప్రధాన అభియోగం మోపింది.
పెరరివాలన్ తో పాటు మరో ఇద్దరు దోషులుగా ఉన్న మురుగన్ , సంతన్ లు జీవిత ఖైదులో ఉన్నారు. కుయిల్ దాసన్ , అర్పుతం అమ్మాళ్ తల్లిదండ్రులు. పేరెంట్స్ ద్రావిడ ఉద్యమ స్థాపకుడు పెరియార్ అనుచరులు.
ఇక ఏజీ పెరరివాలన్ అరెస్ట్ అయిన సమయంలో ఎలక్ట్రానిక్స్ , కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ లో డిప్లొమా పూర్తి చేశాడు. జైలులో ఉండగానే
ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్శిటీ ద్వారా తన బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ , మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ డిగ్రీలను పూర్తి చేశాడు.
2012లో ప్లస్ 2 పరీక్షలో 91.33 శాతం సాధించి ఖైదీలలో ఎక్కువ మార్కులు తెచ్చుకున్న వ్యక్తిగా నిలిచాడు. 2013లో తమిళనాడు ఓపెన్
యూనివర్శిటీ నిర్వహించిన డిప్లొమా కోర్సు పరీక్షలో టాప్ లో నిలిచి బంగారు పతకాన్ని పొందాడు.
చెన్నైయ్ లోని పెరియార్ తిడల్ వద్ద 11 జూన్ 1991న అరెస్ట్ చేశారు పెరరివాలన్ ను. 18 ఫిబ్రవరి 2014న సుప్రీంకోర్టు తీర్పు తర్వాత
మరణ శిక్ష జీవిత ఖైదుగా మార్చారు.
19 ఫిబ్రవరి 2014న తమిళనాడు సర్కార్ అతడితో పాటు మరో ఆరుగురు దోషులను విడుదల చేయాలని కోరింది. రాజీవ్ మర్డర్ కేసు
ది ట్రూత్ స్పీక్స్ అనే పుస్తకాన్ని రాశాడు.
Also Read : పూలమ్మింది పీహెచ్‌డీ చదువుతోంది