Terror Suspect DG Case : జైళ్ల శాఖ డీజీ హత్య కేసులో ఉగ్ర కోణం
ఇంటి పనోడు యాసిర్ అహ్మద్ పాత్ర
Terror Suspect DG Case : దేశ వ్యాప్తంగా సంచలనం కలిగించింది జమ్మూ కాశ్మీర్ జైళ్ల శాఖ డీజీ హేమంత్ లోహియా హత్య కేసు. ఇప్పటికే కాశ్మీర్ లోయలో ఉగ్రవాదులు రెచ్చి పోతున్నారు.
మరో వైపు మూడు రోజుల పర్యటనలో బిజీగా ఉన్నారు కేంద్ర హొం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా. జమ్మూ కాశ్మీర్ పోలీసు ఉన్నతాధికారుల ప్రకారం నిందితుడు యాసిర్ అహ్మద్ తన ప్రవర్తనలో దూకుడుగా ఉండేవాడు.
డిప్రెషన్ తో కూడా బాధ పడుతున్నాడు. మరో వైపు ఉగ్ర కోణం కూడా ఉందా లేదా అన్న దానిపై ఆరా తీస్తున్నారు పోలీసులు. జమ్మూ కాశ్మీర్ డైరెక్టర్ జనరల్ (జైలు) హేమంత్ లోహియా హత్యకు(Terror Suspect DG Case) సంబంధించిన ప్రాథమిక దర్యాప్తులో ఇంటి పని వాడైన యాసిర్ అహ్మద్ పాత్ర ఉన్నట్లు తేలింది.
ఇదిలా ఉండగా హేమంత్ లోహియా సోమవారం అర్ధరాత్రి జమ్మూ లోని ఉదేవాలాలోని తన ఇంట్లో గొంతు కోసి శవమై కనిపించాడు. రాత్రి 11.45 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అస్సాంకు చెందిన 57 ఏళ్ల పోలీసు లోహియా ఇటీవలే పదోన్నతి పొంది ఆగస్టులో జైళ్ల డీజీగా నియమితులయ్యారు.
జమ్మూ కాశ్మీర్ పోలీసు ఉన్నతాధికారులు తెలిపిన వివరాల ప్రకారం క్రైమ్ స్పాట్ నుంచి సేకరించిన సీసీ టీవీ ఫుటేజీల్లో యాసిర్ అహ్మద్ నేరం చేసిన తర్వాత పారిపోతున్నట్లు తెలుస్తోంది. అమిత్ చంద్ర షా జమ్మూ కాశ్మీర్ లో ఉన్న సమయంలో ఈ హత్య జరగడం కలకలం రేపింది. ఇవాళ శ్రీనగర్ లో పర్యటించనున్నారు.
Also Read : సిద్దూ హత్య కేసులో లుక్ అవుట్ నోటీసు