Air India Express Issues : కోవిడ్ మార్గదర్శకాలు పాటించాల్సిందే
ప్రయాణికులకు ఎయిర్ ఇండియా వార్నింగ్
Air India Express Issues : కరోనా కొత్త వేరియంట్ వ్యాపిస్తోందని ప్రచారం జరుగుతుండడంతో ఇప్పటికే కేంద్రం మార్గదర్శకాలు విడుదల చేసింది. భారత్ బయోటెక్ తయారు చేసిన నాసల్ వ్యాక్సిన్లకు ఓకే చెప్పింది.
ఈ తరుణంలో అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు పాటించాల్సిందేనని స్పష్టం చేసింది. ఈ తరుణంలో కీలక నిర్ణయం తీసుకుంది ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ . యుఏఈ నుండి భారత దేశానికి వచ్చే ప్రయాణికులకు విధిగా కోవిడ్ మార్గదర్శకాలు పాటించాలని సూచించింది.
సందర్శకులందరూ తమ దేశంలో కోవిడ్ -19కి వ్యతిరేకంగా టీకా ఆమోదించిన ప్రాథమిక షెడ్యూల్ ప్రకారం పూర్తిగా రోగ నిరోధక శక్తిని పొందాలని సిఫార్సు చేస్తున్నట్లు ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ (Air India Express Issues) తెలిపింది.
పిల్లలకు పరీక్షలు అవసరం లేదని వెల్లడించింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుండి భారతదేశానికి వచ్చే ప్రయాణికులు ప్రతి ఒక్కరు కోవిడ్ మార్గదర్శకాలు పాటించాల్సిందేనని స్పష్టం చేసింది. లేక పోతే తాము జర్నీకి అనుమతించే ప్రసక్తి లేదని పేర్కొంది.
సందర్శకులంతా పూర్తిగా రోగ నిరోధక శక్తి ఉన్నట్లు సర్టిఫికెట్ ఉండాలని తెలిపింది. ప్రతి ఒక్కరు విధిగా మాస్క్ లు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని సూచించింది ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ . తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ లో స్పష్టం చేసింది.
భారత్ వచ్చే ప్రవాస భారతీయులు లేదా అరబ్ జాతీయులు విధిగా ఆ దేశంలో టీకాలను పొంది ఉండాలని పేర్కొంది. ఇందుకు సంబంధించిన సర్టిఫికెట్ ను సమర్పించాలని కోరింది ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ సంస్థ.
Also Read : ట్విట్టర్ సిఇఓ రేసులో శివ అయ్యదురై..?