Tata Air India : చావు కబురు చల్లగా చెప్పింది కేంద్ర సర్కార్. ప్రభుత్వ సంస్థలను అమ్మకానికి పెట్టింది. దేశ అభివృద్ది కోసమే అమ్ముతున్నామని అంటోంది.
గతంలో ఏలిన పాలకులు కోట్లాది రూపాయల విలువైన ఆస్తులను పరిరక్షిస్తే నరేంద్ర మోదీ సారథ్యం లోని బీజేపీ సంకీర్ణ సర్కార్ వాటిని ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టే పనిలో పడ్డది.
ఎవరైనా నష్టాల్లో వస్తే ఆస్తులను తనఖా పెడతారు. లేదంటే వాటికి ఉద్దీపన ప్యాకేజీలు ప్రకటించి వాటిని ఆదుకునే ప్రయత్నం చేస్తాయి. కానీ ప్రధానిగా మోదీ రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాక అమ్మకమే ప్రధాన ఎజెండాగా పెట్టుకుంటూ వచ్చారు.
ఓ వైపు నిత్యావసర ధరలు పెరుగుతున్నాయి. ఇంకో వైపు కరోనా పేదలు, మధ్యతరగతి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తోంది. గతంలో ఎన్నడూ లేని రీతిలో ఈ ప్రభుత్వ హయాంలో బడా బాబులు, కార్పొరేట్ కంపెనీలు, వ్యాపారవేత్తలు లాభాల బాట పట్టారు.
ఇక ఫార్మా రంగమైతే చెప్పాల్సిన పని లేదు. జనం రోగాలతో వ్యాపారం చేసే సంస్థలకు పద్మ పురస్కారాలు ప్రకటించే స్థాయికి చేరుకుంది సర్కార్. ఇక తాజా విషయానికి వస్తే 69 ఏళ్ల తర్వాత ఎయిర్ ఇండియా(Tata Air India) టాటా గ్రూప్ పరమైంది.
ఎయిర్ ఇండియా ప్రైవేటీకరణ కోసం బిడ్స్ పిలిచింది. అందులో టాటా గ్రూప్ 18 వేల కోట్లకు చేజిక్కించుకుంది. గత ఏడాది అక్టోబర్ 8న టాటా పరం చేసినట్లు ప్రకటించింది కేంద్ర సర్కార్.
లెటర్ ఆఫ్ ఇంటెంట్ కూడా జారీ చేసింది. మొత్తంగా మోదీ చావు కబురు చల్లగా చెప్పారు.
Also Read : ఎల్ఐసీ క్రెడిట్ కార్డులతో లాభం