Ajinkya Rahane : ర‌ఫ్పాడించిన అజింక్యా ర‌హానే

కోల్ క‌తా బౌల‌ర్ల‌కు బిగ్ షాక్

సంప్ర‌దాయ ఆట‌కు భిన్నంగా ఈసారి ఐపీఎల్ 16వ సీజ‌న్ లో దుమ్ము రేపుతున్నాడు అజింక్యా ర‌హానే. ఫోర్లు, సిక్స‌ర్ల‌తో ప్ర‌త్య‌ర్థి జ‌ట్లకు చుక్క‌లు చూపిస్తున్నాడు. క్లాసిక్ షాట్స్ కు పెట్టింది పేరు. కానీ ఈసారి త‌న రూట్ మార్చాడు. వ‌స్తూనే దాడి చేయ‌డం మొద‌లు పెడుతున్నాడు. ప్ర‌తి మ్యాచ్ లో అద్బుతంగా రాణిస్తూ త‌న‌దైన ముద్ర క‌న‌బ‌రుస్తున్నాడు.

బౌల‌ర్లు ఎవ‌రైనా స‌రే దంచి కొట్ట‌డం ప‌నిగా పెట్టుకున్నాడు అజింక్యా ర‌హానే. క్రికెట్ ఫ్యాన్స్ ఇప్పుడు విస్తు పోతున్నారు అజింక్యా ర‌హానే ఆట తీరును చూసింది. ఇత‌ర జ‌ట్లు సైతం విస్మ‌యానికి గుర‌వుతున్నాయి. కేవ‌లం క్లాసిక‌ల్ ఇన్నింగ్స్ ను ఆడేందుకు ఎక్కువ‌గా ఇష్ట‌ప‌డే ఈ స్టార్ క్రికెట‌ర్ ఇప్పుడు ఐపీఎల్ లో మోస్ట్ ఫేవ‌ర‌బుల్ ప్లేయ‌ర్ గా మారాడు.

లీగ్ మ్యాచ్ లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదిక‌గా కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ తో జ‌రిగిన మ్యాచ్ లో ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగాడు అజింక్యా ర‌హానే. కేవ‌లం 29 బంతులు మాత్ర‌మే ఎదుర్కొన్న ర‌హానే 6 ఫోర్లు 5 సిక్స్ ల‌తో రెచ్చి పోయాడు. శివ‌మ్ దూబేతో క‌లిసి 85 ప‌రుగుల భాగ‌స్వామ్యాన్ని నెలకొల్పాడు. మ్యాచ్ చివ‌రి వ‌ర‌కు నిలిచాడు. మొత్తంగా త‌న‌కు ఎదురే లేద‌ని చాటాడు ర‌హానే.

ప్ర‌త్య‌ర్థుల గుండెల్లో రైళ్లు పరుగెత్తించాడు. ప్ర‌స్తుతం అజింక్యా ర‌హానే ఐపీఎల్ లో చ‌ర్చ‌నీయాంశంగా మారాడు. ఈ ఏడాదిలోనే భార‌త్ వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ కు ఆతిథ్యం ఇవ్వ‌నుంది. దీంతో జ‌ట్టులో స్థానం కోల్పోయిన ర‌హానేకు బీసీసీఐ ఛాన్స్ ఇస్తుందా అన్న‌ది చూడాలి.

Leave A Reply

Your Email Id will not be published!