Ajit Doval : ర‌ష్యా ప్ర‌ధాన‌మంత్రితో అజిత్ దోవ‌ల్ భేటీ

భార‌త్ - ర‌ష్యా సంబంధాల మ‌ధ్య బంధం

Ajit Doval : భార‌త జాతీయ భ‌ద్ర‌తా స‌ల‌హాదారు అజిత్ దోవ‌ల్ ర‌ష్యాలో ప‌ర్య‌టిస్తున్నారు. ఈ సంద‌ర్భంగా ఆ దేశ రాజ‌ధాని మాస్కోలో ప్ర‌ధాన మంత్రి నికోలాయ్ ప‌ట్రుషేవ్ తో భేటీ అయ్యారు.

కీల‌క అంశాల‌పై ప్ర‌ధానంగా చ‌ర్చించారు. ర‌ష్యా – భార‌తీయ ప్ర‌త్యేక‌, విశేష‌మైన వ్యూహాత్మ‌క భాగ‌స్వామ్యం ప్ర‌గ‌తిశీల అభివృద్ధి గురించి ప్ర‌ధానంగా ప్ర‌స్తావించారు.

రెండు దేశాల భ‌ద్ర‌తా మండ‌లి మ‌ధ్య సంభాష‌న‌ను కొన‌సాగించేందుకు ఇరు ప‌క్షాలు అంగీక‌రించాయి. ఈ భేటీ గురించి ర‌ష్యా కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది.

ప్రాంతీయ , ప్ర‌పంచ స‌మ‌స్య‌ల‌పై దృష్టి సారించారు. భ‌ద్ర‌తా రంగాల‌లో ద్వైపాక్షిక స‌హ‌కారానికి సంబంధించిన స‌మ‌స్య‌ల‌తో పాటు ప్రాంతీయ‌, అంత‌ర్జాతీయ ఎజెండా లోని స‌మ‌యోచిత అంశాల‌పై ఇరు పక్షాలు చ‌ర్చించారు.

మొత్తం ద్వైపాక్షిక వ్యూహాత్మ‌క స‌హ‌కారం , ఆఫ్గ‌నిస్తాన్ లో ప‌రిస్థితికి సంబంధించిన వివిధ అంశాల్లో చ‌ర్చ‌లు చోటు చేసుకున్నాయ‌ని తెలిపింది ర‌ష్యా. ఉక్రెయిన్ లో సంక్షోభాన్ని దౌత్యం, చ‌ర్చ‌ల ద్వారా ప‌రిష్క‌రించు కోవాల‌ని భార‌త దేశం కొన‌సాగిస్తోంది.

గ‌త కొన్ని నెల‌లుగా అనేక పాశ్చాత్య శ‌క్తులు దానిపై ఆందోళ‌న పెంచుతున్నా ర‌ష్యా నుండి త‌గ్గింపుతో కూడిన ముడి చ‌మ‌రు దిగుమ‌తిని కూడా భార‌త దేశం పెంచింది.

ఇదిలా ఉండ‌గా ర‌ష్యా నుండి భార‌త్ ముడి చ‌మురు దిగుమ‌తులు ఏప్రిల్ నుండి 50 రెట్లు పెరిగాయి. ఇది విదేశాల నుండి కొనుగోలు చేసిన మొత్తం ముడి చ‌మురులో 10 శాతంగా ఉంది.

ఈ కీల‌క భేటీలో ఉగ్ర‌వాదానికి వ్య‌తిరేకంగా స‌హ‌కారాన్ని మ‌రింత బ‌లోపేతం చేయాల‌ని పిలుపునిచ్చారు అజిత్ దోవ‌ల్(Ajit Doval).

Also Read : ల‌ఖింపూర్ ఖేరీలో రైతుల ఆందోళ‌న

Leave A Reply

Your Email Id will not be published!