Akasa Air : విలువలు కలిగిన వ్యాపార దిగ్గజం
రాకేష్ ఝున్ ఝున్ వాలా మృతిపై ఆకాస
Akasa Air : ఇండియన్ వారెన్ బఫెట్ గా పేరొందిన ప్రముఖ వ్యాపార దిగ్గజం, స్టాక్ కింగ్ మేకర్ రాకేష్ ఝున్ ఝున్ వాలా(Rakesh Jhunjhunwala)
ఇవాళ గుండె పోటుతో కన్నుమూశారు.
దేశ ప్రధాన మంత్రితో పాటు కేంద్ర మంత్రులు, ఇతర రాజకీయ పార్టీలకు చెందిన వారు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. కేవలం రూ. 5, 000లతో ప్రారంభమైన ఆయన పెట్టుబడి రూ. 41 వేల కోట్ల దాకా విస్తరించేలా చేయడంలో తనను తాను ప్రూవ్ చేసుకున్నారు.
ఒక రకంగా భారత దేశ చరిత్రలో రాకేష్ ఝున్ ఝున్ వాలా చిరస్థాయిగా నిలిచి పోతారు. స్మృతీ ఇరానీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ తాను అన్నయ్యను కోల్పోయానని కన్నీటి పర్యంతం అయ్యారు.
ఎవరి పట్లా వ్యతిరేక భావం లేని మనస్తత్వం ఆయనది. చాలా కూల్ గా సాఫ్ట్ గా తన పనిని తాను చేసుకుంటూ ఇంత దాకా వచ్చారు. ఒక వ్యక్తి వేల కోట్ల సామ్రాజ్యాన్ని, పలు కంపెనీలను ఏర్పాటు చేయడం మామూలు విషయం కాదు. ఆయన తాజాగా విమానయాన రంగంలోకి ఎంట్రీ ఇచ్చారు.
ఈ సందర్బంగా తాను భాగస్వామ్యుడిగా ఉన్న ఆకాస ఎయిర్ లైన్స్(Akasa Air) తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది. రాకేష్ ఝున్ ఝున్ వాలాను కోల్పోవడం మా సంస్థకు తీరని లోటు.
కానీ ఆయన అనుసరించిన విధానం, దిశా నిర్దేశనం చేసిన పద్దతి మాకు ఎల్లప్పటికీ మార్గదర్శకంగా ఉంటుందని పేర్కొంది సంస్థ.
ఝున్ ఝున్ వాలా ఒక వ్యాపారవేత్త మాత్రమే కాదు విలువలు కలిగిన వ్యక్తిగా ఎల్లప్పటికీ నిలచే ఉంటారని స్పష్టం చేసింది.
Also Read : నా సోదరుడిని కోల్పోయా – స్మృతీ ఇరానీ