Akash Chopra : భారత జట్టు మాజీ క్రికెటర్, ప్రస్తుత క్రికెట్ కామెంటేటర్ ఆకాష్ చోప్రా సంచలన కామెంట్స్ చేశాడు. స్వదేశంలో జరిగే విండీస్ టీ20, వన్డే సీరీస్ కు జట్లను బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఎంపిక చేయడంపై ఘాటుగా స్పందించాడు.
చాలా మంది ఆటగాళ్లు గైర్హాజరయ్యారు. బాగా ఆడే వాళ్లను ఎందుకు పరిగణలోకి తీసుకోలేదనే విషయాన్ని వెల్లడించాల్సిన బాధ్యత సెలెక్షన్ కమిటీపై ఉందన్నాడు. రవి బిష్ణోయ్ , ఆవేష్ ఖాన్ లను తీసుకోవడం ఓకే.
కానీ ఇదే సమయంలో అద్భుతంగా రాణించిన రాహుల్ చహర్, వరుణ్ చక్రవర్తిలను ఎందుకు పరిగణలోకి తీసుకోలేదంటూ ప్రశ్నించాడు ఆకాష్ చోప్రా(Akash Chopra ). గాయం కారణంగా రోహిత్ శర్మ వచ్చాడన్నారు.
ఓకే అయితే జట్ల ఎంపిక సమయంలో దేశీవాలీ పరంగా అత్యుత్తమ ఆట తీరు ప్రదర్శించిన ఆటగాళ్లను పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుందన్నాడు. మరి బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఆ దిశగా ప్రయత్నం చేయలేదని తనకు అనిపిస్తోందని వ్యాఖ్యానించాడు.
రవిచంద్రన్ అశ్విన్ ను కూడా తప్పించారు. ఆ ఇద్దరూ ఇప్పుడు ఎక్కడున్నారో తనకు తెలియడం లేదన్నాడు. అశ్విన్, జయంత్ దేశం కోసం దీర్ఘకాలికంగా వన్డే మ్యాచ్ లు ఆడేందుకు సరిపోరన్నాడు.
రవి బిష్ణోయ్ ను తీసుకోవడం ఒక్కటే మంచి పని చేశారంటూ పేర్కొనడం విశేషం. ఇదిలా ఉండగా టీమిండియా సఫారీ టూర్ లో వన్డే, టెస్టు సీరీస్ లు కోల్పోయింది.
దీంతో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి బీసీసీఐపై, సెలక్షన్ కమిటీపై. భారత జట్టు ఆటగాళ్లు ఆటపై పూర్తిగా ఫోకస్ పెట్టలేక పోతుండడంపై ఫ్యాన్స్ మండిపడుతున్నారు.
Also Read : మేం ఆడాం వాళ్ల వల్లనే ఓడాం