Akash Chopra : భారత జట్టు మాజీ క్రికెటర్, ప్రముఖ కామెంటేటర్ ఆకాష్ చోప్రా కీలక వ్యాఖ్యలు చేశారు. భారత, సౌతాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న రెండో వన్డే సందర్భంగా పలు సూచనలు చేశాడు.
టీమిండియాలో పదే పదే ఆటగాళ్లను మార్చడం వల్ల ప్రయోజనం లేదన్నాడు. పర్మినెంట్ టీమ్ ను ఎంపిక చేస్తే బావుంటుందని సూచించాడు. సఫారీ బౌలర్లను ఎదుర్కోవడంలో మనోళ్లు ఆసక్తి చూపడం లేదని ఆవేదన చెందాడు.
భారత బ్యాటింగ్ ఆర్డర్ కంటే సఫారీ ఆటగాళ్లు మరింత మెరుగైన స్థితిలో ఉన్నారంటూ పేర్కొన్నాడు. ఫస్ట్ వన్డే మ్యాచ్ లో భారత బౌలర్లు పూర్తిగా విఫలమయ్యారని, ప్రధానంగా కేఎల్ రాహుల్ నాయకత్వ లేమి కనిపించిందని ఎద్దేవా చేశాడు.
ఒకానొక దశలో పటిష్ట స్థితిలో ఉన్న టీమిండియా ఆ తర్వాత చేతులెత్తేయడం దారుణమని పేర్కొన్నాడు ఆకాశ్ చోప్రా(Akash Chopra ). అటు బౌలింగ్ లోను ఇటు బ్యాటింగ్ లోనూ భారత్ ఆశించిన మేర రాణించ లేక పోయిందని అభిప్రాయ పడ్డాడు.
ఇలాగే ఆడితే భవిష్యత్తులో టీమిండియా మరింత ప్రమాదకరమైన పరిస్థితిని ఎదుర్కోక తప్పదన్నాడు. కొత్తగా హెడ్ కోచ్ గా బాధ్యతలు తీసుకున్న రాహుల్ ద్రవిడ్ బ్యాటింగ్ ఆర్డర్ ను మార్చాల్సిన అవసరం ఉందని సూచించాడు.
అయితే భారత జట్టు కుదుట పడేందుకు ఇంకాస్త టైం పడుతుందని పేర్కొన్నాడు. ఏది ఏమైనా కనీస పోరాటం లేకుండా భారత ఆటగాళ్లు ఆడడం తనను విస్తు పోయేలా చేసిందన్నాడు. భిన్నంగా ఉండే సఫారీ మైదానాలపై రాణిస్తే బావుంటుందన్నాడు.
Also Read : రాహుల్ కెప్టెన్సీపై సన్నీ ఫైర్