Akhilesh Yadav : ఎస్పీ జాతీయ చీఫ్ గా అఖిలేష్ యాదవ్
మూడోసారి ఎన్నిక కానున్న మాజీ సీఎం
Akhilesh Yadav : సమాజ్ వాది పార్టీ జాతీయ అధ్యక్షుడిగా రెండోసారి ఎన్నిక కానున్నారు ప్రస్తుత పార్టీ చీఫ్, మాజీ సీఎం అఖిలేష్ యాదవ్. 2024 జాతీయ స్థాయి సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి.
ఇప్పటి నుంచే కీలక పాత్ర పోషించనున్నారు. కేంద్రంలో కొలువు తీరిన భారతీయ జనతా పార్టీని ఎదుర్కోవాలంటే ప్రతిపక్షాలన్నీ ఒకే కూటమిగా ఏర్పాటు కావాలని పిలుపునిస్తున్నారు అఖిలేష్ యాదవ్(Akhilesh Yadav).
యుపీలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పవర్ లోకి రావాలని ఎస్పీ ప్రయత్నం చేసింది. కానీ ఊహించని రీతిలో షాక్ తగిలింది. సీఎం అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ రెండోసారి రాష్ట్రంలో పాగా వేసింది. పార్టీ చీఫ్ కు సంబంధించి ఎన్నిక జరగనుంది.
అయితే ఈ పదవి పూర్తిగా లాంఛనంగా మారనుంది. అఖిలేష్ యాదవ్ మరోసారి (మూడోసారి) తిరిగి సమాజ్ వాది పార్టీ చీఫ్ గా ఎన్నిక కానున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. ఇదిలా ఉండగా గతంలో జనవరి 2017లో లక్నోలో జరిగిన అత్యవసర జాతీయ సమావేశంలో అఖిలేష్ యాదవ్(Akhilesh Yadav) అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.
బుధవారం నుండి లక్నోలో జరిగే రెండు రోజుల పార్టీ రాష్ట్ర, జాతీయ సమావేశాలలో వరుసగా మూడోసారి సమాజ్ వాది పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నిక కానున్నారు.
రాష్ట్ర సదస్సును ఉద్దేశించి అఖిలేష్ యాదవ్ ప్రసంగిస్తారు. 29న సమావేశం ముగుస్తుంది. ఈ సందర్భంగా రాష్ట్రంలో, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పార్టీ తీర్మానాలను ఆమోదించనున్నారు.
సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ఏర్పాటులో కీలక పాత్ర పోషించనున్నారు అఖిలేష్ యాదవ్.
Also Read : మేడంను కలవనున్న గెహ్లాట్