Akhilesh Yadav : ఎగ్జిట్ పోల్స్ బ‌క్వాస్ – అఖిలేష్ 

గెలిచేది మేమే ప‌వ‌ర్ మాదే 

Akhilesh Yadav : ప్రీ పోల్స్ స‌ర్వేల‌ను..ఎగ్జిట్ పోల్స్ ను తాము న‌మ్మ‌డం లేద‌న్నారు స‌మాజ్ వాది పార్టీ చీఫ్ ,మాజీ సీఎం అఖిలేష్ యాద‌వ్(Akhilesh Yadav ). అవ‌న్నీ బ‌క్వాస్ అని కొట్టి పారేశారు. ఈనెల 10న ఎన్నిక‌ల ఫ‌లితాలు వెలువడ్డాక కాషాయం కొట్టుకు పోతుంద‌న్నారు.

తాము ప‌వ‌ర్ లోకి రావ‌డం ఖాయ‌మ‌న్నారు. గ‌త కొంత కాలం నుంచి బీజేపీ అన్నింటిని మేనేజ్ చేస్తూ పోతోంద‌ని ప్ర‌జ‌లు వాటిని ప‌ట్టించు కోవ‌డం మానేశారంటూ ఆరోపించారు.

త‌మ‌కు 300 సీట్లు గెలుచుకుంటామ‌న్నారు అఖిలేష్ యాద‌వ్ . అధికారంలో ఉన్న భార‌తీయ జ‌న‌తా పార్టీ ప‌దే ప‌దే అబ‌ద్దాల‌ను, ఆల్ రెడీ అస‌త్య డేటాను ప్ర‌సారం చేసేలా చేస్తోందంటూ ఆరోపించారు.

కుటుంబ పాల‌న అంటూ బీజేపీ చేస్తున్న ఆరోప‌ణ‌ల‌ను ఆయ‌న కొట్టి పారేశారు. సీఎం ఆదిత్యా నాథ్ , రాజ్ నాథ్ సింగ్, క‌ళ్యాణ్ సింగ్ వారి వార‌సులు రాలేదా అని ప్ర‌శ్నించారు.

మ‌రో వైపు అమిత్ షాపై సీరియ‌స్ కామెంట్స్ చేశారు. ఆయ‌న కుమారుడు జే షా కు ఏం అర్హ‌త ఉంద‌ని బీసీసీఐ కార్య‌ద‌ర్శిని చేశారంటూ ప్ర‌శ్నించారు. ఎక్క‌డైనా మ్యాచ్ ఆడాడా అని ఎద్దేవా చేశారు.

ప‌వ‌ర్ షా చేతిలో ఉండ‌బ‌ట్టే అక్క‌డ మ‌కాం వేశాడంటూ మండిప‌డ్డారు. మోదీ, యోగీ ఏం సాధించార‌ని వాళ్ల‌కు ఓట్లు వేయాల‌ని ఆయ‌న అన్నారు.

ఇప్ప‌టికే ప్ర‌జ‌లు ఈ రాచ‌రిక పాల‌న‌కు చ‌ర‌మ గీతం పాడాల‌ని అనుకున్నార‌ని ఆ దిశ‌గా ఓట్లు త‌మ‌కు వేశార‌ని చెప్పారు. రైతులు, బ‌డుగు, బ‌ల‌హీన వ‌ర్గాల వారంతా త‌మ వైపు ఉన్నార‌ని మార్పు త‌థ్య‌మ‌న్నారు అఖిలేష్ యాద‌వ్.

Also Read : 21 వ‌ర‌కు న‌వాబ్ మాలిక్ క‌స్ట‌డీకి

Leave A Reply

Your Email Id will not be published!