Akunuri Murali Adani : అదానీ మోసం మోదీ మౌనం

ఎవ‌ర‌న్నారు ఈ దేశం పేద‌ద‌ని

Akunuri Murali Adani : మాజీ సీనియ‌ర్ ఐఏఎస్ ఆఫీస‌ర్ ఆకునూరి ముర‌ళి సీరియ‌స్ కామెంట్స్ చేశారు. ఈ దేశంలో అపార‌మైన వ‌న‌రుల‌ను వ్యాపార‌వేత్త‌ల‌కు, బ‌డా పారిశ్రామిక‌వేత్త‌లు, కార్పొరేట్ల‌కు అప్ప‌నంగా ధారాద‌త్తం చేసిన ఘ‌న‌త ప్ర‌ధాన‌మంత్రి నరేంద్ర మోదీకే ద‌క్కుతుంద‌ని ఆరోపించారు. రాష్ట్రంలో కేసీఆర్ , దేశంలో మోదీ బీజేపీ ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల సొమ్మును ప‌క్క‌దారి ప‌ట్టించార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

2014 సంవ‌త్స‌రాని కంటే ముందు అదానీ గ్రూప్ సంస్థ‌ల చైర్మ‌న్ గౌత‌మ్ అదానీ ర్యాంకు ప్ర‌పంచ కుబేరుల జాబితాలో 600వ ర్యాంకుగా ఉండేద‌ని పేర్కొన్నారు. ఆ త‌ర్వాత మోదీ ప్ర‌ధాన‌మంత్రి గా ప్ర‌మాణ స్వీకారం చేసిన ఈ తొమ్మిది సంవ‌త్స‌రాల కాలంలో ఏకంగా వ‌ర‌ల్డ్ రిచెస్ట్ ప‌ర్స‌న్స్ లిస్టులో ఏకంగా 2వ స్థానానికి చేరుకున్నాడ‌ని ఇది ఎలా సాధ్య‌మైంద‌ని ప్ర‌శ్నించారు ఆకునూరి ముర‌ళి(Akunuri Murali).

నిన్న‌టి దాకా నిస్సిగ్గుగా గౌత‌మ్ అదానీని వెన‌కేసుకు వ‌చ్చిన ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర దామోద‌ర దాస్ మోదీ ఇవాళ ఎందుకు మౌనంగా ఉన్నార‌ని ఆయ‌న నిల‌దీశారు. పార్ల‌మెంట్ లో చ‌ర్చ‌కు ఒప్పుకోక పోవ‌డం దారుణ‌మ‌న్నారు. ప్ర‌పంచ స్థాయిలో బిలియ‌నీర్ గా ఎదిగిన గౌత‌మ్ అదానీ ఎందుక‌ని ఇప్ప‌టి వ‌ర‌కు ట్యాక్స్ చెల్లించ‌లేదో దేశ ప్ర‌జ‌ల‌కు కేంద్ర ప్ర‌భుత్వం బేష‌ర‌తుగా స‌మాధానం చెప్పాల‌ని ఆకునూరి ముర‌ళి డిమాండ్ చేశారు.

ఇదిలా ఉండ‌గా అమెరికాకు చెందిన హిండెన్ బ‌ర్గ్ రీసెర్చ్ సంస్థ సంచ‌ల‌న నివేదిక బ‌య‌ట పెట్టింది. అదానీ గ్రూప్ స‌మ‌ర్పించిన లెక్క‌ల‌న్నీ త‌ప్పేన‌ని ఆరోపించింది. ఇన్ని ల‌క్ష‌ల కోట్ల సంప‌ద‌తో దేశంలో ఉన్న పేద‌రికాన్ని పోగొట్ట వ‌చ్చ‌ని పేర్కొన్నారు ఆకునూరి ముర‌ళి(Akunuri Murali).

Also Read : జ‌గ‌న్ గ్రేట్ అప్పుల్లో రికార్డ్ – ప‌వ‌న్

Leave A Reply

Your Email Id will not be published!