Alishetty Prabhakar : అక్షరాలతో అగ్గి రాజేసిన అలిశెట్టి
బతుకులోని కర్కశత్వాన్ని ఒలికించిన కవి
Alishetty Prabhakar : జనం కోసం బతికిన కవి. బతుకు కర్కశత్వాన్ని, నగరంలోని అనాగరికతను, సమాజంలోని డొల్లతనాన్ని నిర్బయంగా తన కవిత్వంతో, చిత్రాలతో ప్రకటించిన అద్భుతమైన కవి.
బతికింది కొన్నాళ్లే. కానీ ఒక తరానికి సరిపడా దాచుకోవాల్సినంత కవిత్వాన్ని మనకు అందించి పోయాడు. ఎన్ని బాధలు, ఎన్ని కష్టాలు. అన్నింటినీ తట్టుకుని నిలబడిన కవిరేణ్యుడు.
కవి అన్న వాడు ఎటు వైపు ఉండాలన్న ప్రశ్న ఉదయించినప్పుడల్లా తాను, తన కలం, జీవితమంతా జనం కోసమేనంటూ చాటిన వాడు. కరీంనగర్ జిల్లా జగిత్యాలలో 1956 జనవరి 12న పుట్టాడు అలిశెట్టి ప్రభాకర్(Alishetty Prabhakar ).
1993 ఇదే రోజున ఇక సెలవంటూ వెళ్లి పోయాడు. ఆయన రాసిన ప్రతి అక్షరం అగ్గిని రాజేసింది. గుండెల్ని పిండేలా చేసింది.
అతడి అక్షరాలు దట్టించిన ఆయుధాలు. గుండెల్ని చీల్చే తూటాలు కూడా. ప్రశ్నించక పోతే కవిత్వం ఎందుకు అన్నాడు.
సిటీ లైట్స్ పేరుతో ఆయన రాసినవన్నీ అభాగ్యనగరం బతుకు చిత్రాన్ని కళ్లకు కట్టేలా చేశాడు.
అలిశెట్టి (Alishetty Prabhakar )కవి మాత్రమే కాదు చిత్రకారుడు, ఫోటోగ్రాఫర్ కూడా. అలిశెట్టికి ఏడుగురు అక్కా చెళ్లెల్లు. ఇద్దరు అన్న తమ్ముడు.
తండ్రి పరిశ్రమల శాఖలో పని చేస్తూ మృత్యువాత పడ్డాడు. ఆయన ఆకస్మిక మరణంతో అలిశెట్టి 11 ఏళ్లపపుడే కుటుంబ పోషణ బాధ్యతలు చేపట్టాడు.
ఆదర్శాలకు అనుగుణంగా పేదదైన భాగ్యంను పెళ్లి చేసుకున్నాడు.
జీవించడం కోసమే తపన పడిన మనిషి. ఏనాడూ కాసుల కోసం వెంపర్లాడని ప్రజా కవి. కళా రవి అలిశెట్టి. తన కళ చివరి దాక ప్రజల కోసమేనంటూ స్పష్టం చేశాడు. 1982లో హైదరాబాద్ కు వచ్చాడు.
ఆంధ్రజ్యోతి పేపర్ లో ఆరేళ్ల పాటు సిటీ లైఫ్ పేరుతో మినీ కవిత్వం రాశాడు. మొదట చిత్రకారుడిగా స్టార్ట్ చేశాడు. 1975లో జగిత్యాలలో సొంత ఇంట్లో పూర్ణిమ పేరుతో స్టూడియో ఏర్పాటు చేశాడు.
కరీంనగర్ లో శిల్పి స్టూడియో, హైదరాబాద్ లో చిత్రలేఖ పేరుతో నడిపాడు. జగిత్యాలలో సాహితీ మిత్ర సంస్థ దీప్తితో పరిచయంతో కవిత్వ రంగంలోకి ప్రవేశించాడు అలిశెట్టి.
ఆయన పేరుతో అచ్చయినవి ఎర్ర పావురాలు, మంటల జెండాలు, చురకలు, రక్త రేఖ, ఎన్నికల ఎండమావి, సంక్షోభ గీతం, సిటీ లైఫ్ ఉన్నాయి.
సెక్స్ వర్కర్ల గురించి ప్రభాకర్ రాసిన తనువు పుండై..తాను పండై..తాను శవమై వేరొకరి వశమై తను ఎడారై ఎందరికో ఒయాసిస్సై అంటూ వాస్తవ చిత్రాన్ని కళ్లకు కట్టాడు అలిశెట్టి. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో రాశాడు. క్షయ వ్యాధితో 1993లో జనవరి 12న ఇక సెలవంటూ వెళ్లి పోయాడు.
Also Read : హక్కుల యోధుడు బాలల పాలిట దేవుడు