Sanju Samson Qualifier2 : క‌ళ్ల‌న్నీ మిస్ట‌ర్ కూల్ పైనే

రాణిస్తాడా లేక చేతులెత్తేస్తాడా

Sanju Samson Qualifier2 : కేర‌ళ స్టార్ సంజూ శాంసన్ త‌న కెరీర్ లో ఎన్న‌డూ లేనంత ఒత్తిడిని ఎదుర్కొంటున్నాడు. దుబాయ్ వేదిక‌గా జ‌రిగిన 2021 ఐపీఎల్ 14వ సీజ‌న్ లో వ్య‌క్తిగ‌త స్కోర్ ఆట‌గాళ్ల జాబితాలో టాప్ 5 లో ఉన్నాడు.

అద్భుతంగా రాణించాడు. ఈసారి ఐపీఎల్ 2022లో ఆశించినంత మేర రాణించ లేక పోయాడు. ప్ర‌ధానంగా స్టార్ హిట్ట‌ర్ గా పేరొందాడు. ఆట‌గాడిగా వంద మార్కులు వేసినా నిల‌క‌డ‌లేని త‌నం కార‌ణంగా అన‌వ‌స‌ర షాట్స్ కు వెళ్లి వికెట్ ను పారేసుకుంటున్నాడు.

ఇప్ప‌టి వ‌ర‌కు ఐపీఎల్ లో రాజ‌స్తాన్ రాయ‌ల్స్ జ‌ట్టును ప్లే ఆఫ్స్ కు చేర్చాడు. క్వాలిఫ‌యిర్ -1లో గుజ‌రాత్ తో ఓడి పోయింది ఆ జ‌ట్టు. అద్భుతంగా ఆడాడు. కానీ ప‌రుగులు చేయ‌లేక పోయాడు.

ఇక ఎప్ప‌టి లాగే జోస్ బ‌ట్ల‌ర్ దుమ్ము రేపినా గుజ‌రాత్ 7 వికెట్ల తేడాతో ఘ‌న విజ‌యాన్ని న‌మోదు చేసి నేరుగా ఫైన‌ల్ కు చెక్కేసింది.

ఇక మ‌రో ఛాన్స్ ఉండ‌డంతో ఇవాళ అహ్మ‌దాబాద్ లోని మోదీ స్టేడియంలో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు తో క్వాలిఫ‌యిర్ -2 ఆడ‌నుంది రాజ‌స్తాన్.

ఇరు జ‌ట్లు పైకి చూస్తే బ‌లంగా ఉన్న‌ప్ప‌టికీ బౌలింగ్ ప‌రంగా రాజ‌స్తాన్ ఇబ్బంది ప‌డుతోంది. ఇక బెంగ‌ళూరు ల‌క్నోను మ‌ట్టి క‌రిపించి మ‌రింత జోరు మీదుంది. ఎలాగైనా స‌రే టైటిల్ ను చేజిక్కించు కోవాల‌ని ఉవ్విళ్లూరుతోంది.

ఇక స్టార్ హిట్ట‌ర్ సంజూ శాంస‌న్ (Sanju Samson Qualifier2) ఏం చేయ‌బోతున్నాడ‌నేది ఉత్కంఠ భ‌రితంగా మారింది. రాణిస్తే ఆ జ‌ట్టుకు బ‌లం లేక పోతే ఇబ్బందిక‌ర‌మేన‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

Also Read : యుద్ధానికి సిద్దం గెలుపు కోసం పోరాటం

Leave A Reply

Your Email Id will not be published!