Avishka Fernando : అవిష్క ఫెర్నాండో ద‌మ్మున్నోడు

శ్రీ‌లంక జ‌ట్టులో స్టార్ హిట్ట‌ర్

Avishka Fernando : ఎవ‌రీ అవిష్క ఫెర్నాండో అనుకుంటున్నారా. ఇప్పుడు శ్రీ‌లంక జ‌ట్టులో స్టార్ హిట్ట‌ర్. ఒక్క‌సారి మైదానంలోకి వ‌చ్చాడంటే ఇక ఆప‌డం ఎవ‌రి త‌రం కాదు. ఎలాంటి బౌల‌ర్ అయినా స‌రే కుదురుకుంటే ఇక చుక్క‌లే. గ‌త ఏడాది అవిష్క ఫెర్నాండో(Avishka Fernando) దుమ్ము రేపాడు. 6 సిక్స‌ర్లు 37 ఫోర్లు 339 ప‌రుగులు చేశాడు. ప్ర‌స్తుతం భార‌త జ‌ట్టుతో జ‌రిగే టీ20 సీరీస్ లో ఆడేందుకు స‌న్న‌ద్ధం అయ్యాడు.

ప్ర‌స్తుతం భార‌త బౌల‌ర్ల‌కు సింహ స్వ‌ప్నంగా మారే అవ‌కాశం ఎక్కువ‌గా ఉంద‌ని క్రికెట్ విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు. ఇక టీమ్ ఇండియాలో సీనియ‌ర్లు కొంద‌రు లేరు. యువ ఆట‌గాళ్ల‌తో నిండి పోయింది. మ‌నోళ్లు కూడా ఐపీఎల్ లో స‌త్తా చాటారు. బంగ్లా టూర్ లో కూడా మెరిశారు. కానీ ముంబైలో జ‌రిగే మ్యాచ్ లో అంద‌రి క‌ళ్లు ఈ యువ ఆట‌గాడు అవిష్క ఫెర్నాండో పైనే ఉందంటే న‌మ్మ‌లేం.

అంత‌లా పాపుల‌ర్ అయ్యాడు. ముంబై వాంఖ‌డే స్టేడియంలో ఎలా ఆడ‌తాడ‌నే దానిపై ఉత్కంఠ నెల‌కొంది. ఇటీవ‌లే క్రికెట్ లోకి వ‌చ్చిన అవిష్క ఫెర్నాండో హాట్ టాపిక్ గా మారాడు. ప్ర‌స్తుతం భార‌త జ‌ట్టు ఫెవ‌రేట్ గా దిగుతున్నా టీ20 ఫార్మాట్ లో ఎవు ఎప్పుడు ఎలా రాణిస్తారో చెప్ప‌లేం.

శ్రీ‌లంక జ‌ట్టును త‌క్కువ‌గా అంచ‌నా వేసేందుకు వీలు లేద‌ని ఇప్ప‌టికే హెచ్చ‌రించాడు మాజీ కెప్టెన్ కుమార సంగ‌క్క‌ర‌. లంక ప్రిమీయ‌ర్ లీగ్ లో దుమ్ము రేపాడు అవిష్క ఫెర్నాండో. అత‌డు ప్రాతినిధ్యం వ‌హించిన జాఫ్నా కింగ్స్ చాంపియ‌న్ గా నిలిచేలా చేశాడు. స‌దీర స‌మ‌క్ర‌మ్ , నువాన్ తుషార‌, క‌సున్ ర‌జిత కూడా ఉన్నారు. వీరి నుంచి ముప్పు భార‌త్ కు ఉండ‌నుంది.

Also Read : సంజూ శాంస‌న్ కు ఛాన్స్ ఇవ్వాలి

Leave A Reply

Your Email Id will not be published!