IPL 2023 Focus : ఐపీఎల్ వేలంలో అందరి కళ్లు వీరి పైనే
సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారిన ఓనర్స్
IPL 2023 Focus : వచ్చే ఏడాది 2023లో నిర్వహించే మెగా ఇండియన్ ప్రిమీయర్ లీగ్ (ఐపీఎల్ ) టోర్నీకి(IPL 2023) సంబంధించి సందడి మొదలైంది. కేరళ లోని కొచ్చిలో మినీ వేలం పాటకు వేళ అయ్యింది. మొత్తం 925 మందికి పైగా దరఖాస్తు చేసుకుంటే బీసీసీఐ కేవలం 405 మంది ఆటగాళ్లకు మాత్రమే ఛాన్స్ ఇచ్చింది.
ఈ ఏడాది నుంచి రెండు జట్లు అదనంగా పాల్గొంటున్నాయి. వాటిలో లక్నో జెయింట్స్ కాగా ఇంకోటి గుజరాత్ టైటాన్స్. ఇదిలా ఉండగా మినీ వేలం పాటలో ఎక్కువగా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచేది మాత్రం ఆయా ఫ్రాంచైజీలకు సంబంధించిన యజమానులు. ఒక రకంగా చెప్పాలంటే ముద్దుగుమ్మలుగా పేరొందారు.
సోషల్ మీడియాలో టాప్ అందమైన ఓనర్ గా గుర్తింపు పొందారు సన్ రైజర్స్ ఆఫ్ హైదరాబాద్ సిఇఓ దయానిధి మారన్ కూతురు కావ్య మారన్. ఇక కోల్ కతా నైట్ రైడర్స్ కు సహ యజమానిగా ఉన్నారు జుహ్లీ చావ్లా. బెంగళూరు వేదికగా జరిగిన వేలం పాటలో షారుఖ్ ఖాన్ తనయుడు, జూహ్లీ చావ్లా కూతురు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచారు.
ఇక ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ ఓనర్ గా ఉన్న నీతా అంబానీ కూడా ఈసారి మినీ వేలం పాటలో పాల్గొనే ఛాన్స్ ఉంది. పంజాబ్ కింగ్స్ ఎలెవన్ కు సొట్ట బుగ్గల హీరోయిన్ గా పేరొందారు ప్రీతి జింతా. ఆమె కరోనా కారణంగా పాల్గొనలేదు.
ఈసారి కొచ్చిలో జరిగే వేలం పాటలో ఈ సుందరాంగులలో ఎవరు పాల్గొంటారనే దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మొత్తంగా కావ్య మారన్ పైనే అందరి కళ్లు ఉంటాయనేది వాస్తవం.
Also Read : కావ్య మారన్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్