IPL 2022 Auction : ఐపీఎల్ మెగా రిచ్ లీగ్ కు రెడీ అవుతోంది బీసీసీఐ. ఇప్పటికే ఏర్పాట్లు చేసింది. ప్రపంచ వ్యాప్తంగా టీ20 ఫార్మాట్ లో ఇండియన్ ప్రమియర్ లీగ్ -2022 (IPL 2022 Auction)కోసం మెగా వేలం పాట చేపట్టేందుకు సన్నద్దమైంది.
అందరి కళ్లు ఈ మెగా వేలం పాటపైనే ఉంది. వేలం పాట రెండు రోజుల పాటు కొనసాగనుంది. ఈనెల 12, 13 తేదీలలో బెంగళూరులో జరగనుంది. మొత్తం వేలం పాటలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెటర్లు 1214 మంది దరఖాస్తు చేసుకున్నారు.
మొత్తం వచ్చిన వాటిలో అర్హులైన ఆటగాళ్లు 590 మందిని ఎంపిక చేసింది భారతీయ క్రికెట్ నియంత్రణ మండలి – బీసీసీఐ. ప్రతి ఏటా జరిగే ఈ ఐపీఎల్(IPL 2022 Auction) కు వేల కోట్ల ఆదాయం సమకూరుతుంది.
బేస్ రేట్ నుంచి భారీ రేట్ వరకు ఎవరికి దక్కుతుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది. దమ్మున్న ఆటగాళ్లను ఏ ఫ్రాంచైజీ దక్కించు కుంటుందనే దానిపై చర్చ జరుగుతోంది.
ఈ వేలం పాట మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రారంభమవుతుంది. ఓ స్టార్ హోటల్ లో నిర్వహిస్తోంది బీసీసీఐ. స్టార్ స్పోర్ట్స్ టెలికాస్ట్ చేయనుంది.
ఇక మొత్తం వేలం పాటలో 370 మంది భారత క్రికెట్ కు చెందిన ప్లేయర్లు ఉండగా 220 మంది విదేశాలకు చెందిన క్రికెటర్లు వేలం పాటలో పాల్గొంటారు.
ఇప్పటి దాకా 14 సార్లు ఐపీఎల్ జరిగింది. త్వరలో 15వ సీజన్ జరగనుంది. గతంలో 8 జట్లు పాల్గొంటే ఈసారి 2 అదనంగా చేరాయి. మొత్తం 10 జట్లు పాల్గొననున్నాయి. మొత్తంగా క్యాప్ డ్ , 354 అన్ క్యాప్ డ్ ప్లేయర్లు ఉన్నారు.
Also Read : పుష్ప మేనియా కోహ్లీ వారెవా