Chetan Sharma : ఈ దేశంలో క్రికెట్ అన్నది ఆట కాదు అది కోట్లాది భారతీయులు ఆరాధించే ఏకైక మతం. గల్లీ గల్లీకో క్రికెటర్ ఉన్నాడు. తయారవుతున్నారు కూడా.
ఈ తరుణంలో టీమిండియాకు ప్రాతినిధ్యం వహించాలంటే చాలా దమ్ముండాలి. గతంలో లాగా ఎంపికయ్యే పరిస్థితి లేదు. ఇప్పుడు రాహుల్ ద్రవిడ్ పుణ్యమా అని లెక్కకు మించి యువ రక్తంతో నిండిన ఆటగాళ్లు రెడీగా ఉన్నారు.
ఎలాంటి సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్దమని ప్రకటిస్తున్నారు. ఇందుకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ దోహదం చేసినా పరిస్థితి మాత్రం భారత జట్టు గెలిస్తే ఓకే. కానీ ఓడిపోతే మాత్రం అందరి కళ్లు ఎంపిక చేసిన బీసీసీఐ సెలెక్టర్ల పై పడుతుంది.
తాజాగా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది చేతన్ శర్మ (Chetan Sharma)నేతృత్వంలోని భారతీయ ఎంపిక కమిటీ. కోహ్లీని తప్పుకునేలా చేశారనే ఆరోపణలు వెల్లువెత్తిన తరుణంలో భారత జట్టు సఫారీ టూర్ లో చేతులెత్తేసింది.
అత్యంత పేలవమైన ఆటతీరును ప్రదర్శించింది టీమిండియా. ముగ్గురు లేదా నలుగురు ఆటగాళ్లు మాత్రమే రాణించారు. మిగతా వాళ్లంతా అలా వచ్చి ఇలా వెళ్లామా అన్న రీతిలో ఆడటం భారత అభిమానులను తీవ్ర నిరాశకు గురయ్యేలా చేసింది.
అటు టెస్టుల్లో ఇటు వన్డేల్లో చేతులెత్తేసి సీరీస్ లు పోగొట్టుకుంది. తాత్కాలిక కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టిన కేఎల్ రాహుల్ చివరకు పేలవమైన నాయకత్వంతో భారత్ కు ఎలాంటి విజయాన్ని చేకూర్చ పెట్టలేదన్న అపవాదును మూటగట్టుకున్నాడు.
ఈ విషయాన్ని మాజీ కెప్టెన్ గవాస్కర్ తప్పు పట్టాడు. ఈ తరుణంలో ఇకనైనా గెలుపు గుర్రాలను ఎంపిక చేయాలని కోట్లాది అభిమానులు కోరుతున్నారు.
Also Read : చేతులెత్తేశారు పరువు తీశారు