Women IPL 2023 BCCI : మహిళల ఐపీఎల్ పై ఫ్రాంచైజీల నజర్
వేలానికి సిద్దం చేసిన బీసీసీఐ
Women IPL 2023 BCCI : భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ఏది చేసినా ఓ సంచలనమే. ప్రపంచ క్రికెట్ లో అత్యధిక ఆదాయం కలిగిన క్రీడా సంస్థగా పేరొందింది. తాజాగా ప్రతి పేటా నిర్వహిస్తూ వస్తున్న పురుషుల ఐపీఎల్ కు భారీ ఆదారణతో పాటు గణనీయమైన ఆదాయం సమకూరుతోంది.
దీంతో పురుషులకు ధీటుగా మహిళలకు సంబంధించి ఐపీఎల్ చేపట్టాలని నిర్ణయించింది. ఈ మేరకు ఐదు జట్లను ఖరారు చేసింది. ఇందు కోసం బిడ్ లను కూడా ఆహ్వానించింది. ఈనెల 21 ఆఖరు తేదీ. ప్రతి జట్టును చేజిక్కించు కోవాలంటే ధరను ముందుగా చెల్లించాల్సి ఉంటుంది.
ఇప్పటికే మెన్స్ ఐపీఎల్ లో ఫ్రాంచైజీలు మహిళల జట్లను(Women IPL 2023 BCCI) కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. మార్చి 4 నుంచి 26వ తేదీ వరకు దాదాపు 22 రోజుల పాటు మహిళల ఐపీఎల్ చేపట్టనుంది బీసీసీఐ. ఇప్పటికే ఏర్పాట్లు కూడా చేసింది. అయితే మహిళా ఐపీఎల్ కు సంబంధించి ప్రసార హక్కుల గురించి ఇంకా క్లారిటీ ఇవ్వలేదు.
అది కూడా కోట్లల్లోనే పలికే ఛాన్స్ ఉంది. ఇకపోతే తాజాగా చెన్నై సూపర్ కింగ్స్ కూడా ప్రకటించింది. తాము కూడా విమెన్ ఐపీఎల్ లో పార్టిసిపేట్ చేస్తామని. అంటే బిడ్స్ లో పాల్గొననుంది. ఇక మహిళల ఐపీఎల్ లో జట్లను కొనుగోలు చేసేందుకు చెన్నై సూపర్ కింగ్స్ తో పాటు రాజస్థాన్ రాయల్స్ , ఢిల్లీ క్యాపిటల్స్ , కోల్ కతా నైట్ రైడర్స్ , పంజాబ్ కింగ్స్ ఎలెవన్ ఆసక్తిని చూపిస్తున్నాయి.
ఇప్పటికే విమెన్ ఐపీఎల్ ఫ్రాంచైజ్ టెండర్ డాక్యుమెంట్లను తీసుకున్నాయి. ఇప్పటికే ఐపీఎల్ లో నాలుగు సార్లు ఛాంపియన్ గా నిలిచాం. మా లాంటి పెద్ద జట్టు మహిళా జట్టును తీసుకోక పోతే ఎలా అని పేర్కొన్నారు సిఎస్కే సిఇఓ కాశీ విశ్వనాథన్. తాము కూడా బిడ్ లో పాల్గొంటున్నట్లు ప్రకటించారు రాజస్థాన్ రాయల్స్ చైర్మన్ రంజిత్ బర్తకూర్.
ఇదిలా ఉండగా జట్టును కొనుగోలు చేసేందుకు బీసీసీఐ(Women IPL 2023 BCCI) ఇంకా బేస్ ధర నిర్ణయించ లేదు. ఒక్కో జట్టుకు కనీసం రూ. 400 కోట్లు ఉండవచ్చని అంచనా. ఇది ఓ రికార్డ్ అని చెప్పక తప్పదు. ఇక బిడ్స్ లో పాల్గొనాలంటే నాన్ రిఫెండబుల్ ( తిరిగి చెల్లించని) కింద రూ. 5,00,000 కట్టాల్సి ఉంటుంది. ఇప్పటికే ఆయా ఫ్రాంచైజీలు చెల్లించాయి. ఈనెల 21 తర్వాతే తేలుతుంది. ఎవరు ఏమిటనేది.
Also Read : ఆసియా కప్ షెడ్యూల్ ఖరారు